మహేశ్ నెక్ట్స్ మూవీ డైరక్టర్ మారిపోయాడా..!

మహేశ్ 26వ సినిమా దర్శకుడు మారిపోయాడా..? లెక్కల మాష్టారుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు సూపర్‌స్టార్ సిద్ధంగా లేడా..? సీనియారిటీ కాదు బౌండ్ స్క్రిప్ట్‌కే మహేశ్ ఓటేస్తున్నాడా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి ఫిలింనగర్‌లో. ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తోన్న మహేశ్ బాబు.. ఆ తరువాత సుకుమార్‌ డైరక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేశ్ 26వ చిత్రంగా ఈ కాంబో ఉండనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ తదుపరి చిత్రం అనిల్ […]

మహేశ్ నెక్ట్స్ మూవీ డైరక్టర్ మారిపోయాడా..!

మహేశ్ 26వ సినిమా దర్శకుడు మారిపోయాడా..? లెక్కల మాష్టారుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు సూపర్‌స్టార్ సిద్ధంగా లేడా..? సీనియారిటీ కాదు బౌండ్ స్క్రిప్ట్‌కే మహేశ్ ఓటేస్తున్నాడా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి ఫిలింనగర్‌లో. ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తోన్న మహేశ్ బాబు.. ఆ తరువాత సుకుమార్‌ డైరక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేశ్ 26వ చిత్రంగా ఈ కాంబో ఉండనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్‌కు ఓకే చెప్పిన మహేశ్.. పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేయమని చెప్పాడట. ఇందుకోసం సుకుమార్‌కు చాలా సమయం కూడా ఇచ్చేశాడట. అయితే ఇప్పటికీ సుకుమార్ స్క్రిప్ట్‌ పూర్తి చేయకపోవడం.. అందుకు మరో ఆరు నెలల సమయం కోరడంతో ఆ లోపు ఇంకో దర్శకుడితో వెళ్లాలని మహేశ్ భావిస్తున్నాట. మరోవైపు ‘ఎఫ్ 2’తో వరుసగా నాలుగు విజయాలు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఇటీవల మహేశ్‌ను కలిసి ఓ లైన్‌ను చెప్పాడట. దానికి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్‌ కూడా అనిల్ వద్ద సిద్ధంగా ఉండటంతో.. అతడితో కలిసి వెళ్లాలని మహేశ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటక రానున్నట్లు టాక్. కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ‘మహర్షి’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Published On - 11:53 am, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu