Akhil Akkineni: ప్రభాస్‌ను కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Akhil Akkineni: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెలింగ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి...
Akhil Akkineni: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. టైమ్ ట్రావెలింగ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో అక్కినేని అమల శర్వానంద్ తల్లిగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటి వరకు టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాలన్నీ విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా అమలా, శర్వాలతో కలిసి ‘అమ్మ చేతి వంట’ అనే చిట్‌చాట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో అక్కినేని అఖిల్ కూడా పాల్గొనడం విశేషం. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రోమోను విడుదల చేశారు. సరదాగా సాగిన ఈ వీడియోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అఖిల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
‘ప్రభాస్ చాలా ఫుడీ’ అంట కదా అని అమలా అడగ్గా.. దానికి అఖిల్ బదులిస్తూ.. ‘అవును ప్రభాస్‌ను కలిసిన సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలు తినలేను అన్నా కూడా వదిలి పెట్టరు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక మరో పక్క నుంచి శర్వానంద్ మాట్లాడుతూ.. ఒక 30 రకాల డిషెస్‌తో అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రోమో సరదా సరదాగా సాగింది. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..