‘తలా’ సినిమాకు.. రికార్డులు దాసోహం!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేర్కొండ పార్వాయ్‌’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రెండు రోజుల కలెక్షన్స్ 30 కోట్లపైగా వచ్చాయని తెలుస్తోంది. అటు కన్నడిగులు కూడా ఈ మూవీను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా యూఏఈలో రూ.2.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు యూనిట్ పేర్కొన్నారు. అజిత్ హవాకు విదేశాల్లో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు రాబట్టిందని నిర్మాత […]

  • Ravi Kiran
  • Publish Date - 7:42 am, Mon, 12 August 19
'తలా' సినిమాకు.. రికార్డులు దాసోహం!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేర్కొండ పార్వాయ్‌’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రెండు రోజుల కలెక్షన్స్ 30 కోట్లపైగా వచ్చాయని తెలుస్తోంది. అటు కన్నడిగులు కూడా ఈ మూవీను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా యూఏఈలో రూ.2.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు యూనిట్ పేర్కొన్నారు. అజిత్ హవాకు విదేశాల్లో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు రాబట్టిందని నిర్మాత బోనీ కపూర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హిందీ హిట్ సినిమా ‘పింక్’కు తమిళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలం, అరుణ్‌ చిదంబరం, అధిక్‌ రావిచంద్రన్‌, అశ్విన్‌ రావు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమా కలెక్షన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ‘నేర్కొండ పార్వాయ్‌’ బీట్ చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.