Saaho Trailer: మెగాస్టార్ మెసేజ్..యంగ్ రెబల్ స్టార్ సర్‌ప్రైజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటీ క్వీన్ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ మూవీని తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ‘సాహో’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ‘సాహో’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు మంచి కిక్కెచ్చేలా శనివారం ట్రైలర్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  […]

Saaho Trailer: మెగాస్టార్ మెసేజ్..యంగ్ రెబల్ స్టార్ సర్‌ప్రైజ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 12, 2019 | 5:43 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటీ క్వీన్ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ మూవీని తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ‘సాహో’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ‘సాహో’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు మంచి కిక్కెచ్చేలా శనివారం ట్రైలర్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ మొదలుపెట్టింది.

రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో.. ట్రైలర్ చూసిన తరవాత మెగాస్టార్ చిరంజీవి తనకు టెక్ట్స్ మెసేజ్ పెట్టారని, అది చూసి తాను వెంటనే ఆయనకి ఫోన్ చేశానని ప్రభాస్ వెల్లడించారు. ట్రైలర్ చాలా బాగుందంటూ చిరంజీవి గారు ప్రశంసించారని ప్రభాస్ చెప్పారు. చిరంజీవి గారి ప్రశంస తనకు గూస్‌బంప్ అని, అదే పెద్ద విజయమని అన్నారు.