రణరంగం ‘సౌండ్ కట్’ ట్రైలర్… చెర్రీకి నచ్చింది గురూ!
హీరో శర్వానంద్ ప్రతి సినిమాకు వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్‌లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా […]
హీరో శర్వానంద్ ప్రతి సినిమాకు వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్‌లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కాగా ఈ సినిమా సౌండ్ కట్ ట్రైలర్‌ను చెర్రీ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సౌండ్ కట్ అద్భుతంగా. చాలా కొత్తగా ఉంది. మొన్న విడుదలైన ట్రైలర్ కూడా నాకు నచ్చింది. మేం శర్వాను ఎలా చూడాలనుకున్నామో అలానే ఉన్నాడు. శర్వా నటించిన ‘కో అంటే కోటి’ నాకు ఇష్టం. ఆ చిత్రంలో అతడిలోని తీవ్రత నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మళ్లీ అదే తీవ్రతతో ఈ సినిమాలో నటించాడు. సుధీర్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రశాంత్ పిళ్లై కూడా సూపర్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.