ముంబైలో నడి రోడ్డుపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కారును అడ్డగించిన రైతు, ఆ తరువాత

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కి ఎన్నడూ కలగని అనుభవం మంగళవారం కలిగింది. ముంబైలో దినోషీ ప్రాంతంలోని ఫిల్మ్ సిటీకి ఆయన కారులో వెళ్తుండగా ఆ వాహనాన్ని నడి రోడ్డులో ఓ వ్యక్తి అడ్డగించాడు.

  • Umakanth Rao
  • Publish Date - 7:24 pm, Tue, 2 March 21
ముంబైలో నడి రోడ్డుపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కారును అడ్డగించిన రైతు, ఆ తరువాత

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కి ఎన్నడూ కలగని అనుభవం మంగళవారం కలిగింది. ముంబైలో దినోషీ ప్రాంతంలోని ఫిల్మ్ సిటీకి ఆయన కారులో వెళ్తుండగా ఆ వాహనాన్ని నడి రోడ్డులో ఓ వ్యక్తి అడ్డగించాడు. అజయ్ దేవ్ గన్ తన కారును ఆపగానే..రైతుల నిరసనపై వ్యాఖ్యానించాలని ఆ వ్యక్తి కోరాడు. తనకు ఎదురైన ఈ హఠాత్పరిణామం పై ఏం చెప్పాలో తెలియని ఈ నటుడు ఏదో అనబోయేంతలో ఆ వ్యక్తి.. ఆయనను ‘పంజాబీకా దుష్మన్’ (పంజాబ్ శత్రువు) అంటూ దూషించడం ప్రారంభించాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడైనా అజయ్ దేవ్ గన్ రైతుల నిరసనపై ఏమాత్రం స్పందించలేదని, నువ్వు ఆ రాష్ట్రానికి శత్రువువని నిందించాడట.   రోడ్డుపై  ఈ గలాటా సుమారు 15-20 నిముషాలపాటు సాగింది. ఆ వ్యక్తిని రాజ్ దీప్  సింగ్ అనే రైతుగా గుర్తించారు. చివరకు పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఐపీసీ లోని మూడు సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టారు.

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన  అన్నదాతలు ఇన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా అజయ్ దేవ్ గన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తమ రైతులకు మద్దతు ప్రకటించలేదని రాజ్ దీప్ సింగ్ ఆగ్రహంగా ఇలా ఆయన కారును నడి రోడ్డుపై ఆపాడని పోలీసులు తెలిపారు. ఈ గొడవ ముగిశాక అజయ్ దేవ్ గన్ షూటింగ్ కోసం ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోయాడు. కాగా- లోగడ రైతుల  ఆందోళనపై అమెరికా పాప్ స్టార్ రిహానా ట్వీట్ చేసిన అనంతరం అజయ్ దేవ్ గన్ కూడా ట్వీట్ చేసినా దానికి అంతగా ప్రాచుర్యం లభించలేదు.

Read More :

మూడవ అంతస్తు నుండి పిల్లల్ని కిటికీలోంచి ప‌డేసిన త‌ల్లి! Mother Throwing Children Out The Window Viral Video.

వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..! హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని కార్తీకదీపం హీరోయిన్ :Kaarthikadeepam Vantalakka propertys Video