బెల్లంకొండతో ‘ఆర్‌ఎక్స్’ దర్శకుడి మూవీ క్యాన్సిల్..!

‘ఆర్‌ఎక్స్‌100’తో టాలీవుడ్‌లో అందరినీ మెప్పించాడు దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ కంటెంట్ తీసుకున్నప్పటికీ.. ఆ చిత్రాన్ని అజయ్ తెరకెక్కించిన తీరుకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ తరువాత పలువురు హీరోలు కూడా అజయ్‌తో పనిచేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో రామ్, నితిన్ ఇలా పలువురి పేర్లు వినిపించాయి. అయితే బెల్లంకొండతో రెండో సినిమాను ప్రకటించాడు అజయ్. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:21 pm, Tue, 19 March 19
బెల్లంకొండతో ‘ఆర్‌ఎక్స్’ దర్శకుడి మూవీ క్యాన్సిల్..!

‘ఆర్‌ఎక్స్‌100’తో టాలీవుడ్‌లో అందరినీ మెప్పించాడు దర్శకుడు అజయ్ భూపతి. బోల్డ్ కంటెంట్ తీసుకున్నప్పటికీ.. ఆ చిత్రాన్ని అజయ్ తెరకెక్కించిన తీరుకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ తరువాత పలువురు హీరోలు కూడా అజయ్‌తో పనిచేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో రామ్, నితిన్ ఇలా పలువురి పేర్లు వినిపించాయి.

అయితే బెల్లంకొండతో రెండో సినిమాను ప్రకటించాడు అజయ్. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలీదు గానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకున్నట్లు ఇటీవల ఓ న్యూస్ రాగా.. తాజాగా బెల్లంకొండ కూడా తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు తెలీవు కానీ ఈ ప్రాజెక్ట్‌లో బెల్లంకొండ చేయనని చెప్పినట్లు తెలుస్తోంది.