‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్..!
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ ను మీరే ఇవ్వండంటూ రాజమౌళి తాజా ప్రెస్ మీట్ లో అభిమానులను ఉద్దేశించి చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి పేరు […]

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ ను మీరే ఇవ్వండంటూ రాజమౌళి తాజా ప్రెస్ మీట్ లో అభిమానులను ఉద్దేశించి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా ఇప్పుడు ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి పేరు ‘రఘుపతి రాఘవ రాజారామ్’ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఇక సినిమా కథాంశం ప్రకారం ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి హీరోల మధ్య పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.