Unstoppable Season 4: ‘దెబ్బకు థింకింగ్ మారితీరాలా’.. ఆకట్టుకుంటోన్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌4 ప్రోమో మేకింగ్‌

నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన

Unstoppable Season 4: 'దెబ్బకు థింకింగ్ మారితీరాలా'.. ఆకట్టుకుంటోన్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌4 ప్రోమో మేకింగ్‌
Unstoppable Season 4
Follow us

|

Updated on: Oct 20, 2024 | 8:38 AM

నట సింహం బాలకృష్ణ సరికొత్త అవతారంలో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాక్‌ షో.. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌ షోకు ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్‌ల విజయవంతంగా పూర్తయ్యాయి. తాజాగా 4వ సీజన్‌ను ప్రారంభించేందుకే మేకర్స్‌ రడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది.

కాగా సీజన్‌ 4 ప్రకటనకు సంబంధించి మేకర్స్‌ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ అనౌన్స్ చేసి సరికొత్త ప్రోమోని కూడా రిలీజ్ చేసారు. ఇందులో బాలయ్య యానిమేటెడ్‌ సూపర్ హీరోగా కనిపిచడం విశేషం. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ముఖ్యంగా చిన్నారులు ఈ సూపర్‌ హీరో క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆహా టీమ్‌ ఈ ప్రోమోకు సంబంధించి మేకింగ్ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో బాలయ్యను ఎలా షూట్‌ చేశారు. సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించేందుకు టీమ్‌ ఎంతలా కష్టపడందన్న విషయాన్ని వివరించారు. కాగా ఈ ప్రాసెస్‌ను ఆహా టీమ్‌ ఎంతో ఎంజాయ్‌ చేసినట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బాలయ్య బాబు డైలగ్స్‌ చెబుతూ, జై బాలయ్య అంటూ ప్రోమో డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే సీజన్‌4 తొలి ఎపిసోడ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఆదివారం షూటింగ్‌ జరగనున్నట్లు సమాచారం. కాగా గతంలో ప్రతిపక్షంలో ఉ్న సమయంలో చంద్రబాబు ఈ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పాల్గొంటుండడం విశేషం. ఇదిలా ఉంటే తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌, సూర్య, దుల్కర్‌ సల్మన్‌తో పాటు సమంత కూడా హాజరుకానున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..