Flipkart Big diwali sale: దీపావళి సేల్‌లో ఊహకందని డీల్స్.. వీటిపై భారీ డిస్కౌంట్స్
దసరా పండుగ నేపథ్యంలో మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ తో కస్టమర్లను ఆకట్టుకున్న ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. తాజాగా దీపావళి సేల్ ను తీసుకొస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళి పేరుతో నిర్వహించనున్న ఈ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్స్ ను అందించనున్నారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ సేల్ లో అందిస్తోన్న కొన్ని డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌కు సిద్ధమైంది. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ పేరుతో కస్టమర్లకు భారీ డిస్కౌంట్స్‌ను అందించిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీపావళి పండును పురస్కరించుకొని బిగ్ దీపావళి సేల్ పేరుతో మరోసారి యూజర్లను ఆకట్టుకునేందుకు వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.
ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ యూజర్లకు ఒక రోజు ముందు నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్స్ లభించనున్నాయి. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 15పై ఊహకందని తగ్గింపు లభిస్తోంది.
ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అన్ని రకాల వస్తువులపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15ని యూజర్లు కేవలం రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరింత తగ్గింపు ధర పొందే అవకాశాన్ని కల్పించారు. ఇక ఫ్లిప్ కార్ట్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 5జీ ఫోన్‌పై భారీ సేల్‌ను అందిస్తున్నారు.
ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను రూ. 37,999కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా యాపిల్ ఎయిర్‌పాడ్‌ను కూడా రూ. 10 వేల కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ వీటితో పాటు పలు రకాల బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రతీ గంటకు బాండ్ డీల్ పేరుతో ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రకాల ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌ను అందించననున్నట్లు ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..