Medicines Rates: ఒక్కసారిగా పెరిగిన మందుల రేట్లు.. సామాన్యుడికి మరింత భారం!

గత కొన్ని రోజులుగా ధరలు పెంచాలంటూ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చివరకు NPPA (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) ధర పెంచడానికి అంగీకరించింది.

Medicines Rates: ఒక్కసారిగా పెరిగిన మందుల రేట్లు.. సామాన్యుడికి మరింత భారం!
Medicines
Follow us

|

Updated on: Oct 20, 2024 | 9:30 AM

ఉప్పు కొనేటట్టు లేదు.. పప్పు తినేటట్టు లేదు. మార్కెట్లో ఏ వస్తువును పట్టుకున్నా.. రేట్లు మండిపోతున్నాయి. బండిలో పోసే పెట్రోల్ దగ్గర నుంచి వంటింట్లో వాడే సిలిండర్ వరకు అన్నీ గుదిబండగా మారాయి. అటు టోల్ రేట్లు కూడా మోత మోగిస్తున్నాయి. ఇదే సమయంలో రోగమొస్తే కొనే మందు బిళ్లల రేట్లు కూడా పెరగడం.. సామాన్యుడిపై పిడుగు పడ్డంత పనయింది.

ఆరోగ్య బీమా-జీవిత బీమా రంగంలో ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తుండగా, ఆరోగ్య రంగంలో కూడా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. ఎనిమిది నిత్యావసర మందుల ధరలు పెరిగాయి. ఆస్తమా, టీబీ, ఆస్తమా, తలసేమియా, గ్లకోమా వంటి అనేక ఔషధాల ధరలను కేంద్రం ఒక్కసారిగా యాభై శాతం పెంచింది.

గత కొన్ని రోజులుగా ధరలు పెంచాలంటూ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చివరకు NPPA (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) ధర పెంచడానికి అంగీకరించింది. ఔషధాల తయారీకి వివిధ పదార్థాల కొనుగోలు ఖర్చు పెరగడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల కంపెనీలు గత ధరకు మందులను విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అదే ఈ నిర్ణయానికి కారణం. అయితే, రోగులే కాదు, వైద్య సంఘంలోని కొంత భాగం కూడా చేరింది.

అయితే ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదంటున్నారు వైద్య నిపుణులు. మన దేశంలో ఎక్కువగా కనిపించే వ్యాధులలో ఆస్తమా, గుండె జబ్బులు, కంటి జబ్బులు ఉన్నాయి. అక్కడ పైలోకార్పైన్, అట్రోపిన్ వంటి మందుల ధరలు పెంచారు. తలసేమియాతో బాధపడుతున్న దురదృష్టకర పిల్లల చికిత్సలో డిఫెరోక్సమైన్ ఒక ముఖ్యమైన మందు. దీని ధర కూడా పెరిగింది. మందుల ధరలను పెంచి పేద ప్రజల భుజాలపై కొత్త భారం మోపవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు సామాన్యులు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ నిత్యవసరాల వస్తువుల ధరలతో సతమతమవుతున్నాం.. ఇప్పుడు మళ్లీ మందుల రేట్లు పెంచితే మధ్య తరగతి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు.

మరోవైపు ఈ యాంత్రిక జీవనంలో మనుషులకు గతంలో ఎన్నడూ లేనంతగా వ్యాధులు, జబ్బులు వస్తున్నాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో రకాల ఔషధాలు వాడాల్సి వస్తోంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్లకు రోజూ బిళ్లలు మింగక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెరిగిన రేట్లతో మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు జనం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..