19 October 2024

అయ్యా బాబోయ్.. లుక్కు మార్చిన సీరియల్ సుందరి.. ఎవరో గుర్తుపట్టారా..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇన్నాళ్లు సీరియల్లో అందంతో కట్టిపడేసింది. కానీ ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుని అభిమానులకు షాకిచ్చింది. ఇప్పుడు ఇలా మారింది. 

తనే బ్రహ్మముడి స్వప్న అలియాస్ హమీదా. బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

అందం, అమాయకత్వంతో బిగ్ బాస్ షోలో చాలా పాపులర్ అయిన హామీదా.. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట యాక్టివ్ అయ్యింది.

ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో అదరగొట్టింది. ఈ పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది హమీదా.

ఇందులో మొదట్లో నెగిటివ్ రోల్ పోషించిన హమీదా ఆ తర్వాత మంచిగా మారిపోయింది. అలాగే అందులో చీరకట్టులో అందంగా కనిపించింది బ్యూటీ. 

స్వప్న పాత్రతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న హమీదా.. ఆ తర్వాత ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. అందుకు రీజన్ తెలియలేదు. 

బ్రహ్మముడి సీరియల్ మానేసిన తర్వాత హమీదా అడియన్స్ ముందుకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. 

తాజాగా హమీదా షేర్ చేసిన ఎల్లో శారీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పసుపు రంగు చీరలో బంగారు ఆభరణాలతో.. ముక్కు పుడకతో అందంగా కనిపిస్తుంది.