Chandrababu: భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్న సీఎం చంద్రబాబు.. ఇంతకీ ఏంటా డేంజర్‌?

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతల పైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయురడు సరదా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నారు.

Chandrababu: భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్న సీఎం చంద్రబాబు.. ఇంతకీ ఏంటా డేంజర్‌?
Ap Cm Chandrababu
Follow us

|

Updated on: Oct 20, 2024 | 9:37 AM

ఒకప్పుడు జనాభా నియంత్రణ ముద్దు. ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి, యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ హితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలకు ఆడపడుచులు కృషి చేయాలని సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతల పైనా సీఎం సరదా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నామంటూ కార్యక్రమంలో నవ్వులు పూయించారు.

వీడియో చూడండి..

Chandrababu

ఆడబిడ్డలు, కనీసం ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలన్నారు చంద్రబాబు. జనాభా విషయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోందని, రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు బాబు. ఒకప్పుడు జనాభా నియంత్రణ ఉండాలని చెప్పా. ఇప్పుడు నేనే వద్దంటున్నా. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ సాయం ఎక్కువగా దక్కుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న యువ భారతం.. 2047 కల్లా వృద్ధ భారతంగా మారనుంది. ఈ డేంజర్‌ను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ కామెంట్లు చేశారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..