Viral Video: కింగ్ కోబ్రాస్ ఎలా పుడతాయో ఎప్పుడైనా చూశారా..? షాకింగ్ వీడియో వైరల్.. చూస్తే అవాక్కే..!
వైరల్ వీడియోలో చిన్న పాముపిల్ల గుడ్డులోంచి బయటకు వస్తున్న దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన కింగ్ కోబ్రా పిల్ల తన నాలుకను బయటకు విదిలించడాన్ని చూడటం భయానకంగా ఉన్నప్పటికీ, నవజాత నాగుపామును చూడటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఆ చిన్న శరీరంతో పాము భలేగా కదులోంది.
పాములంటే దాదాపు ప్రతి ఒక్కరికీ వణుకే.. అలాంటిది కింగ్ కోబ్రా పేరు వినగానే గుండె జారిపోతుంది. అయితే, కుక్కలు, పిల్లి పిల్లలు లేదా దూడలు ఎలా పుడతాయో మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా కింగ్ కోబ్రా పిల్లలు ఎలా పుడతాయో చూశారా..? అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడ్డు నుండి పొదిగిన నాగుపాము పిల్ల ఎలా పుడుతుందో ఈ వీడియోలో కనిపించింది. ఆశ్చర్యకరంగా అనిపించే ఈ వీడియో ఇంటర్నెట్‌లో అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియో నేచర్ ఈజ్ అమేజింగ్ అనే X (గతంలో ట్విట్టర్)లో మళ్లీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. వైరల్ వీడియోలో చిన్న పాముపిల్ల గుడ్డులోంచి బయటకు వస్తున్న దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన కింగ్ కోబ్రా పిల్ల తన నాలుకను బయటకు విదిలించడాన్ని చూడటం భయానకంగా ఉన్నప్పటికీ, నవజాత నాగుపామును చూడటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ఆ చిన్న శరీరంతో పాము భలేగా కదులోంది.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
The birth of a baby cobra pic.twitter.com/DA8PnbGv1Y
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 15, 2024
ఈ వీడియో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వారి వారి స్పందనలను తెలియజేస్తున్నారు. నాగుపాము పిల్ల చురుకుదనం చూసి కొంతమంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు అవాక్కయ్యమంటున్నారు. వీడియోపై మిశ్రమ స్పందనలు ఉన్నప్పటికీ వేలాదిగా వ్యూస్, లైకులు వచ్చాయి. అనేక మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.