Watch: రేయ్.. ఏంట్రా ఇది.. ఆఖరుకు ఆస్పత్రి ఓపీని కూడా వదలకుండా వాడేసుకుంటున్నారుగా..!
ప్రభుత్వాసుపత్రిలో ఓ యువకుడు రీలు వేసేందుకు డ్యా్న్స్‌తో హల్‌చల్ చేశాడు. ఆస్పత్రి ఓపీ బయట పెద్ద సంఖ్యలో రోగులు నిలబడి ఉన్నారు. అక్కడే ఓ యువకుడు ఉన్నట్టుండి విచిత్రంగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. అక్కడ రోగులకు సపోర్ట్‌గా ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. యువకుడి డ్యాన్స్ చూసి తొలుత షాక్‌కు గురైన
సోషల్ మీడియాలో రీల్ చేసి ఫేమస్ కావడానికి నేటి యువత ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. కొన్నిసార్లు కొందరు తమ ప్రాణాలను పణంగా పెడుతుంటే.. మరికొందరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రీల్స్ పిచ్చితో రెచ్చిపోతుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి ఆసుపత్రిలో డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైద్యం కోసం ఆస్పత్రిలో లైన్‌లో నిల్చొని ఉన్న క్రమంలోనే అతడు రీల్ తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందినదిగా తెలిసింది.
జోధ్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఓ యువకుడు రీలు వేసేందుకు డ్యా్న్స్‌తో హల్‌చల్ చేశాడు. ఆస్పత్రి ఓపీ బయట పెద్ద సంఖ్యలో రోగులు నిలబడి ఉన్నారు. అక్కడే ఓ యువకుడు ఉన్నట్టుండి విచిత్రంగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. అక్కడ రోగులకు సపోర్ట్‌గా ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. యువకుడి డ్యాన్స్ చూసి తొలుత షాక్‌కు గురైన పోలీసు.. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా తన పనిలో కూరుకుపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది. ఇది జోధ్‌పూర్‌లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి సంబంధించిన వీడియోగా తెలిసింది.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
View this post on Instagram
ఇక, ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సదరు యువకుడు దానికి క్యాప్షన్‌గా ఇలా రాశాడు..ఆస్పత్రిలో లైన్‌లో నిలబడి ఉన్నవారంతా విసుగు చెందుతున్నారు.. కాబట్టి నేను వారిని ఎంటర్‌టైన్ చేస్తూ.. టైమ్ పాస్ అయ్యేలా చేయాలనుకున్నాను..అని రాశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రిలో ఇలాంటి రీలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు దీనిపై స్పందిస్తూ.. డ్యాన్స్ చేయడానికి అది సరైనది కాదు..ఆసుపత్రిని వదిలిపెట్టమని రాశారు.