తాజ్‌మహాల్ పరిసరాల్లో 12 అడుగుల కొండచిలువ.. పరుగులు తీసిన పర్యాటకులు.. చివరికి ఏమైందంటే?
12 అడుగుల కొండచిలువ తాజ్ మహల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ప్రజల కంటపడింది. దీంతో వారంతా భయంతో అరుపులు, కేకలు పెడుతూ పరుగులు తీవారు. వెంటనే అటవీశాఖ బృందానికి సమాచారం అందించారు. కానీ, అటవీ శాఖ బృందానికి ఫోన్ చేసినా సానుకూల స్పందన రాలేదని స్థానికులు వాపోయారు. చివరకు
ఇటీవల కాలంలో పాములు, కొండచిలువలు వంటివి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా కొండచిలువల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజ్ మహల్ దగ్గర మరోసారి పెద్ద కొండచిలువ కనిపించింది. ప్రజలు భయంతో పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర ఓ పెద్ద కొండచిలువ కలకలం రేపింది. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. భారీ కొండచిలువను చూసిన జనం భయంతో పరుగులు తీశారు. స్థానికులు కొండచిలువను పట్టుకుని సమీపంలోని అడవిలోకి వదిలారు.
12 అడుగుల కొండచిలువ తాజ్ మహల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ప్రజల కంటపడింది. దీంతో వారంతా భయంతో అరుపులు, కేకలు పెడుతూ పరుగులు తీవారు. వెంటనే అటవీశాఖ బృందానికి సమాచారం అందించారు. కానీ, అటవీ శాఖ బృందానికి ఫోన్ చేసినా సానుకూల స్పందన రాలేదని స్థానికులు వాపోయారు. చివరకు స్థానికులే ఆ కొండచిలువను బంధించి అడవిలో వదిలిపెట్టారు.
కొండచిలువను రక్షించేందుకు అటవీ శాఖ బృందం రాకపోవడంతో ప్రజలు రెజ్లర్ సుందర్ దూబే అనే వ్యక్తికి సమాచారం అందించారు. సంజయ్ దూబే సంఘటనా స్థలానికి వెళ్లి కొండచిలువను పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కొండచిలువ దాదాపు 11 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుందని వీడియోలో చెబుతున్నారు.
అటవీ శాఖ బృందం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారీ కొండచిలువ తాజ్‌మహల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అదే జరిగితే మాత్రం పర్యాటకులు, స్థానికులకు ప్రమాదంగా మారి ఉండేదని వాపోయారు. అటవీశాఖ అలసత్వం, నిర్లక్ష్య వైఖరిపట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ताज महल के पास निकला अजगर
वन विभाग की टीम को दी गई जानकारी, नहीं पहुंची
स्थानीय शख्स ने किया अजगर का रेस्क्यू! pic.twitter.com/G3KsIt0agf
— Avinash Tiwari (@TaviJournalist) October 18, 2024
రెజ్లర్ సుందర్ దూబే పాములు పట్టడంలో నేర్పరిగా పేరుగాంచాడు. ఇలాంటి అనేక సందర్భాల్లో ప్రమాదకరమైన పాములను రక్షించాడు. ఇప్పుడు మరోసారి తాజ్ మహల్ దగ్గర కొండచిలువను పట్టుకుని ప్రజలను భయాందోళనల నుంచి కాపాడాడు సంజయ్ దూబే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..