Andhra Pradesh: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.. భీమవరం మావుళ్ళమ్మ మండల దీక్షలు ప్రారంభం

మావుళ్ళమ్మ అమ్మవారి మాల ధారణ దీక్షను 17 సంవత్సరాల క్రితం అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ 11 మందితో ప్రారంభించారు. ఇప్పటికీ మాలధారణ ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం మాల ధారణ సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుత ప్రధాన అర్చకులు

Andhra Pradesh: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి..  భీమవరం మావుళ్ళమ్మ మండల దీక్షలు ప్రారంభం
Mavullamma Mandal Deeksha
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 19, 2024 | 8:55 AM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసుల ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారు‌, గ్రామదేవత. సువర్ణ కాంతులతో భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి. బంగారు వర్ణంలో ఉన్న మావుళ్ళమ్మను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మావుళ్ళమ్మను దర్శించుకుని కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని స్థానికులు విశ్వసిస్తారు . అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి మావుళ్ళమ్మ దర్శించేందుకు భక్తులు వస్తుంటారు. కోరుకున్న కోర్కెలు నెరవేరగానే మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రతినిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మావుళ్ళమ్మ అమ్మవారి మండల దీక్ష మాల ధారణను భక్తులు వైభవంగా జరుపుతారు.

41 రోజులపాటు మావుళ్ళమ్మ వారి దీక్షను స్వీకరిస్తారు. కుంకుమ రంగు వస్త్రాలను ధరిస్తారు. పగడపు మాలను వేసుకుంటారు. గంధం, కుంకుమను సింధూరంగా పూసుకుంటారు. దీక్ష ధరించిన నాటి నుండి దీక్ష విరమణ చేసేంతవరకు అమ్మవారిని ప్రతినిత్యం కొలుస్తునే ఉంటారు.మాల ధారణ చేయడం వల్ల దైవం మీద ధ్యాస పెరుగుతుంది. మనిషిలో అంతర్గత శత్రువులు ఆరు ఉంటాయని పండితులు చెబుతున్నారు. వాటిని అరిషడ్వర్గాలు అంటారు. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను మానవుడు జయించాలి. అరిషడ్వర్గాలను నియంత్రించకపోతే మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుతాడని ఆలయ పండితులు చెబుతున్నారు. అరిషడ్వర్గాలను జయించేందుకు ఇష్టదైవాలను కొలవటం మార్గంగా చెబుతున్నారు. అందుకోసం ఇటివల మాల ధారణలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీక్షలు చేపట్టి భక్తులు ఇష్టదైవాలను కొలుస్తూ నిష్టతో ఉండటం వలన దీక్ష విరమణ తరువాత వారి నడవడిలో మార్పు వస్తుందని పలువురి నమ్మకం.

మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ చేసిన భక్తుడు ప్రతి రోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. భజనలు , సంకీర్తనలు చేస్తారు. తరువాత యధావిధిగా దైనందిన కార్యక్రమాలకు వెళతారు. తమ పని చేసుకుంటూ సాయంత్రం మరల సుచిగా స్నానం చేసి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీక్ష చేపట్టిన అన్ని రోజులు వేకువ జామున స్నానం, ఒంటిపూట భోజనం, వ్యసనాలకు దూరంగా ఉండటం, కోపం లేకుండా దూషణ చేయకుండా ఉండటం, స్త్రీలను తల్లిలా గౌరవించడం చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మావుళ్ళమ్మ అమ్మవారి మాల ధారణ దీక్షను 17 సంవత్సరాల క్రితం అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల రామలింగేశ్వర శర్మ 11 మందితో ప్రారంభించారు. ఇప్పటికీ మాలధారణ ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం మాల ధారణ సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుత ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో మాలాదీక్షాధారణ వైభవంగా ప్రారంభమైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..