Spiritual: తథాస్తు దేవతలు ఎవరు.. వీరు అంటే నిజంగానే పనులు జరుగుతాయా..
సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు. పైన తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని.. తథాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని చెబుతూ ఉండేవారు. చాలా మంది దీనిని వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారో ఇప్పటి రోజుల్లో వారికి తెలియక పోవచ్చు. కానీ పురాణాలు తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంతకీ ఈ తథాస్తు దేవతలు ఎవరు? వీళ్లు తథాస్తు అంటే నిజంగానే నిజమవుతుందా..
సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు. పైన తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని.. తథాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని చెబుతూ ఉండేవారు. చాలా మంది దీనిని వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారో ఇప్పటి రోజుల్లో వారికి తెలియక పోవచ్చు. కానీ పురాణాలు తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంతకీ ఈ తథాస్తు దేవతలు ఎవరు? వీళ్లు తథాస్తు అంటే నిజంగానే నిజమవుతుందా.. ఈ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా వచ్చారు..
పురాణాల ప్రకారం.. తథాస్తు దేవతలు ఉన్నారు. తథాస్తు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయని.. అందుకే పెద్దలు చెడు మాటలు మాట్లాడొద్దని అంటారు. సూర్యుని నుంచే వచ్చే వేడిని భరించలేని భార్య సంధ్యా దేవి.. దూరంగా గుర్రం రూపం ధరించి కురు దేశం వెళ్తుంది. సంధ్యా దేవి దూరాన్ని భరించలేని సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరించి.. సంధ్యా దేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల.. అశ్వనీ దేవతలు ఉద్భవిస్తారు. వీరినే తథాస్తు, వైద్య దేవతలుగా పిలుస్తారు.
ఈ సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు..
వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కువగా సంధ్యా సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు. తథాస్తూ.. తథాస్తూ అనుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో మనం ఏది అన్నా నెరవేరుతుంది. అందుకే సాయంత్రం వేళలో చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు చెబుతారు. వీరు ఎప్పుడూ వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.
ఇలా అస్సలు మాట్లాడకండి..
అలాంటి సమయంలో మనం ధనం లేదని.. ఏమీ లేదని అంటే.. లేకుండానే పోతుందట. అలాగే ఇతరుల గురించి కానీ, మన గురించి కానీ తప్పుగా మాట్లాడినా నిజమవుతాయి. కాబట్టి ఎప్పుడూ మంచే మాట్లాడాలని.. మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి. సంధ్యా సమయంలో గొడవలు కూడా పడకూడదు. కోపంగా ఉండకూడదు. సుమంగళిగా ఉండాలని ఇంట్లో పెద్దలు చెబుతారు.