Watch: ఐఐటీ రూర్కీ మెస్‌లో షాకింగ్ సీన్.. ఆహారంపై వీర విహారం చేస్తున్న ఎలుకలు.. నెట్టింట దుమారం..
దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా-కృష్ణా భవన్ మెస్‌కు కొందరు విద్యార్థులు వెళ్లారు. హాస్టల్ వంట గదిలోని కుక్కర్‌తోపాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండటాన్ని చూశారు. కలుషిత, పాడైన ఆహారాన్ని తమకు అందించడంపై వారంతా నిరసన తెలిపారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ) కిచెన్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్‌గా మారటంతో ఆన్‌లైన్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటనలో ఒక విద్యార్థి భోజనం కోసం రాధా-కృష్ణా భవన్ మెస్‌కు వచ్చాడు.. అప్పుడే ఆహారం తయారు చేస్తున్న కుక్కర్‌లో రెండు ఎలుకలు దూకడం గమనించాడు.. వెంటనే ఆ విద్యార్థి అక్కడి అపరిశుభ్ర పరిస్థితులను వీడియో రికార్డ్ చేశాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలోని హాస్టల్ మెస్ కిచెన్‌లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమనించారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా-కృష్ణా భవన్ మెస్‌కు కొందరు విద్యార్థులు వెళ్లారు. హాస్టల్ వంట గదిలోని కుక్కర్‌తోపాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండటాన్ని చూశారు. కలుషిత, పాడైన ఆహారాన్ని తమకు అందించడంపై వారంతా నిరసన తెలిపారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ఇక ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్ కావటంతో నెటిజన్లతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిప స్పందించారు. హాస్టళ్లలో ఆహార పరిశుభ్రత పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల ఆరోగ్యం వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని వాపోయారు. హాస్టళ్లలో ఇలాంటి భోజనం పెడితే పిల్లలు ఎలా తింటారు..? ఎలా బ్రతుకు తారు అంటూ పలువురు తల్లిదండ్రులు ప్రశ్నించారు. భారతదేశంలోని ఇలాంటి బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రజలు ఎప్పుడు మారతారో అంటూ వాపోయారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..