Fuel Train Derails: ఏనుగుల గుంపును ఢీ కొట్టి పట్టాలు తప్పిన రైలు.. లక్షల లీటర్ల పెట్రోల్ నేలపాలు ..

పట్టాలపై ఉన్న ఏనుగుల గుంపును చూసిన లోకోపైలట్‌ సడన్‌ బ్రేకులు వేశారు. దాంతో రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో పెట్రోల్‌ పూర్తిగా లీకై నేలపాలైంది. మిగతా బోగీల నుంచి ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, మిగతా వాటికి గాయాలైనట్టుగా తెలిసింది.

Fuel Train Derails: ఏనుగుల గుంపును ఢీ కొట్టి పట్టాలు తప్పిన రైలు.. లక్షల లీటర్ల పెట్రోల్ నేలపాలు ..
Fuel Train Derails
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2024 | 7:01 AM

లక్షల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ఓ రైలు భారీ ప్రమాదానికి గురైంది. కొలంబో నుంచి బట్టికలోవాకు వెళ్తున్న రైలు మిన్నేరియా రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అప్పటికే పట్టాలపై ఉన్న ఏనుగుల గుంపును చూసిన లోకోపైలట్‌ సడన్‌ బ్రేకులు వేశారు. దాంతో రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో పెట్రోల్‌ పూర్తిగా లీకై నేలపాలైంది. మిగతా బోగీల నుంచి ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, మిగతా వాటికి గాయాలైనట్టుగా తెలిసింది. ఈ ఘటన శ్రీలంకలోని ఉత్తర మధ్య ప్రావిన్స్‌లో జరిగింది.

శ్రీలంకలోని ఉత్తర మధ్య ప్రావిన్స్‌లో ఇంధనం రవాణా చేస్తున్న రైలు ట్రాక్‌పై అడవి ఏనుగుల గుంపును ఢీకొనడంతో పట్టాలు తప్పినట్లు రైల్వే శాఖ శుక్రవారం నివేదించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రైలు కొలంబోలోని కొలోన్నావా పెట్రోలియం స్టోరేజీ టెర్మినల్ నుండి తూర్పు ప్రావిన్స్‌లోని బట్టికలోవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. సడెన్‌గా బ్రేక్‌లు వేయటం, ఏనుగులను ఢీకొనడంతో నాలుగు ఇంధన ట్యాంకర్లు పట్టాలు తప్పాయని, దీంతో రైల్వే ట్రాక్‌లకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైల్వే శాఖ తెలిపింది.

ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు మృతి చెందగా, మరికొన్ని ఏనుగులు తీవ్రంగా గాయపడ్డాయని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం కారణంగా కొలంబో-బట్టికలోవా ప్రధాన మార్గంలో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!