Watch: మీరు పానీపూరి ప్రియులా .. లోటలేసుకుంటూ తింటున్నారా..? అయితే, ఈ వీడియో చూడండి..
అలాగే టేస్ట్ కోసం ఈ పిండిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించారు. ఇందులో బాత్రూం క్లీనింగ్ కోసం ఉపయోగించే హార్పిక్, పంటకు వేసే యూరియా కూడా వేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పానీపూరీ తయారుచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పానీపూరి.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఈ పానీపూరి అంటే పడిచస్తుంటారు. హైదరాబాద్ వంటి మహానగరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నచిన్న పట్టణాలు, మారుమూల పల్లెల్లో పానీపూరి విక్రయిస్తున్నారు. పానీ పూరీ బండ్ల వద్ద వినిపించే ‘భయ్యా తోడా ప్యాజ్ దాలో’ అనే పదం ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. దీన్నిబట్టే పానీపూరీ ఎంత ఫేమస్సో అర్థమవుతుంది. అయితే ఈ పానీపూరీని ఎలా తయారుచేస్తారో చూస్తే మాత్రం ఇక మీ జీవితంలో పానీపూరి తినాలంటే భయపడిపోతారు. తినడం కాదుకదా పేరెత్తడానికి కూడా వణికిపోతారు. ఇలాంటి పానీపూరి తయారీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా మజిగవాన్ బజార్ ప్రాంతానికి చెందిన అన్షు, రాఘవేంద్ర పానీ పూరీ వ్యాపారం చేస్తున్నారు. వారే పెద్ద మొత్తంలో పానీ పూరీని తయారు చేస్తారు. తాజాగా వీరిద్దరూ పానీ పూరీని ఎలా తయారు చేస్తారో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పానీ పూరీ చేయడానికి పిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించారు. ముందుగా పానీపూరీ తయారీ కోసం పిండిని సిద్ధం చేస్తున్నారు. పిండిని నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ అత్యంత జుగుప్సాకరంగా చేస్తున్నాడు. అలాగే టేస్ట్ కోసం ఈ పిండిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించారు. ఇందులో బాత్రూం క్లీనింగ్ కోసం ఉపయోగించే హార్పిక్, పంటకు వేసే యూరియా కూడా వేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పానీపూరీ తయారుచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వీడియో చూడండి..
गुपचुप खाने वाले हो जाएं सावधान! झारखण्ड के गढ़वा का वीडियो सोशल मीडिया पर वायरल पुलिस ने किया है गिरफ्तार.. जांच जारी #JharkhandNews #Gadwa #Jharkhand pic.twitter.com/0hvOL1tVvT
— Dhananjay Mandal (@dhananjaynews) October 17, 2024
వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అన్షు, రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. పానీపూరీ తయారీలో ఉపయోగించే పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకుని విచారణకు పంపారు. ఇంత అపరిశుభ్రంగా, ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతూ పానీపూరీ తయారు చేయటం చూసిన ప్రజలు వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఈ వీడియో చూస్తున్న వీక్షకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..