విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..! దారి మళ్లించిన అధికారులు.. ఏం జరిగిందంటే..

అక్టోబర్ 18న ఢిల్లీ నుంచి లండన్‌కు నడుపుతున్న విస్తారా ఫ్లైట్ UK17కి సోషల్ మీడియాలో సెక్యూరిటీ బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సంబంధిత అధికారులందరికీ సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా, పైలట్‌లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..! దారి మళ్లించిన అధికారులు.. ఏం జరిగిందంటే..
Bomb Threat
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2024 | 12:12 PM

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్‌-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు సమాచారం అందింది. దీంతో అప్రత్తమైన అధికారులు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత విమానం తిరిగి గమ్యస్థానికి పంపించనున్నట్టుగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్‌కు బయలుదేరింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 18న ఢిల్లీ నుంచి లండన్‌కు నడుపుతున్న విస్తారా ఫ్లైట్ UK17కి సోషల్ మీడియాలో సెక్యూరిటీ బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సంబంధిత అధికారులందరికీ సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా, పైలట్‌లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..