Watch: దీపావళి షాపింగ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇక్కడ చాలా వస్తువులు కేవలం రూ.1-2 లభిస్తున్నాయి..! పోటెత్తిన జనం

సదర్ బజార్‌ సస్తా మార్కెట్లో ఇప్పుడు అత్యంత ఖరీదైన వస్తువులు కూడా కేవలం ఒక్క రూపాయి నుండి రూ.100 ల లోపుగానే లభిస్తున్నాయి. ఇతర మార్కెట్లలో లభించే అనేక ఖరీదైన వస్తువులు ఇక్కడ కేవలం 5-10 రూపాయలకే లభిస్తాయి. ఇక్కడ లభించే కొన్ని వస్తువుల ధరలు తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..

Watch: దీపావళి షాపింగ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇక్కడ చాలా వస్తువులు కేవలం రూ.1-2 లభిస్తున్నాయి..! పోటెత్తిన జనం
Sadar Bazaar
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2024 | 8:43 AM

దీపావళి పండగ దగ్గర పడింది. ఇక మిగిలింది10 రోజులు మాత్రమే. ఇల్లంతా అలంకరిస్తేనే ఈ పండుగ కళ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మార్కెట్‌లో భారీగా షాపింగ్‌ చేస్తున్నారు. ఈ గృహోపకరణాలు, గృహాలంకరణ వస్తువుల, ఎలక్ట్రానిక్స్, పండుగ దుస్తులు, సౌందర్య సాధనాల నుండి ప్రతిదీ కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఓ మార్కెట్‌లో నెలకొన్న రద్దీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. షాపింగ్‌ కోసం వచ్చిన జనాలతో మార్కెట్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. కాళ్లు పెట్టడానికి కూడా స్థలం దొరకడం లేదు. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఒకరినొకరు తోసుకుంటూ, ఊపిరాడకుండా ఉన్నటువంటి దృశ్యాలు కనిపించాయి. ఆడ,మగ తేడా లేకుండా లాగి తోసేసే పరిస్థితి దాపురించింది. ఇదంతా ఎక్కడ..? ఎందుకంత రద్దీ అనే విషయాల్లోకి వెళితే..

ఇది ఢిల్లీలోని సదర్ మార్కెట్.. దీనిని సదర్ బజార్ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో దేశీయ వస్తువులకు అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. ఈ పురాతన మార్కెట్ పాత ఢిల్లీ నడిబొడ్డున ఖరీ బావోలి స్ట్రీట్‌కు పశ్చిమాన ఉంది. ప్రతిరోజూ ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది కొనుగోలుదారులు, వ్యాపారులు, సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ భారీ మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పుడు సదర్ బజార్‌లో ఇంత రద్దీ ఎందుకు అనే సందేహం కలుగొచ్చు..దీనికి చాలా కారణాలున్నాయి. అన్నింటిలో మొదటిది రోజువారీ అవసరాలన్నీ ఇక్కడ చాలా తక్కువ ధరలకు లభించే మార్కెట్ ఇది. ఇతర మార్కెట్లలో లభించే అనేక ఖరీదైన వస్తువులు ఇక్కడ కేవలం 5-10 రూపాయలకే లభిస్తాయి. రెండో కారణం దీపావళి పండుగ దగ్గర పడటం. ఇప్పుడు సదర్ బజార్‌లో ఎంతో ఖరీదైన గృహాలంకరణ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు హోల్‌సేల్ కంటే తక్కువ ధరలకు లభిస్తున్నాయి. దీంతో జనం విపరీతంగా ఎగబడి కొంటున్నారు. కిక్కిరిసిన జనాలతో మార్కెట్లో తొక్కిలాట జరిగింది.

ఇవి కూడా చదవండి

సదర్ బజార్‌ సస్తా మార్కెట్లో ఇప్పుడు అత్యంత ఖరీదైన వస్తువులు కూడా కేవలం ఒక్క రూపాయి నుండి రూ.100 ల లోపుగానే లభిస్తున్నాయి. దీంతో మార్కెట్‌కు జనం తాకిడి పెరిగింది. సదర్ బజార్‌లో మహిళల రద్దీ ఎక్కువగా ఉంది. కాస్మెటిక్ వస్తువులు, కృత్రిమ ఆభరణాలు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్కెట్‌లో బిందీ, మేకప్‌ వస్తువులు, మొబైల్‌ ఉపకరణాలు, స్టేషనరీ, బొమ్మలు, కిచెన్‌ వస్తువులు, టపాకాయలు తదితర నిత్యావసరాలన్నీ కిలో రూ.1 నుంచి రూ.20 వరకే లభిస్తున్నాయి. దీంతో మార్కెట్లో చీమలు కూడా దూరంతా జనం బారులు తీరారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఒక్క రూపాయికి కూడా వస్తువులు దొరుకుతాయి..

ఇక్కడ లభించే కొన్ని వస్తువుల ధరలు తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. ఫేస్ క్రీమ్ రూ.5, మార్కెట్ ధర రూ.80- రూ.100, కృత్రిమ ఆభరణాలు రూ.5 నుంచి రూ.15, మార్కెట్ ధర రూ.50-రూ.250, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సెట్ రూ.5 నుంచి రూ.15, అని కొందరు దుకాణదారులు పేర్కొంటున్నారు. దీని మార్కెట్ ధర, నెయిల్ పాలిష్ – రూ.1-3, మార్కెట్ ధర రూ.50-100, అలంకరణ వస్తువులు, బొమ్మలు, గృహోపకరణాల రోజువారీ వినియోగ వస్తువులు కిలోల లెక్కన అమ్ముతున్నారు.

సదర్ బజార్‌లో దాదాపు 40 వేల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలన్నీ ఇరుకైన వీధుల్లో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఏ పరిమాణంలోనైనా మీకు కావలసిన వస్తువును సులభంగా పొందవచ్చు. సదర్ బజార్ ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మార్కెట్‌లోని దుకాణాలు ఆదివారాలు మాత్రం మూసి ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?