Telangana: ఈ ఇంట్లో నలుగురూ సరస్వతులే.. గ్రేట్ సిస్టర్స్‌..

ఎంబీబీఎస్ సీటు సాధించడం అనేది చాలా మందికి ఒక కల. ఎంతో కష్టపడి ఇందుకోసం కృషి చేస్తుంటారు. అయితే ఇంట్లో ఒక్కరికీ ఎంబీబీఎస్ సీటు వస్తేనే గ్రేట్ అనుకుంటాం. కానీ సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 4గురు ఎంబీబీఎస్ సీట్లను సాధించి ఔరా అనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరీ గ్రేట్ సిస్టర్స్.? వారి స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Telangana: ఈ ఇంట్లో నలుగురూ సరస్వతులే.. గ్రేట్ సిస్టర్స్‌..
Siddpet
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Oct 20, 2024 | 9:45 AM

నలుగురు బిడ్డల్లో ఒకరు డాక్టర్‌ అయితేనే ఆ తల్లిదండ్రుల సంతోషం అంత ఇంత ఉండదు, సగర్వంగా తలెత్తుకుంటారు..అదే ఇద్దరు వైద్యులు అయితే.. వారి ఆనందానికి అవధులు ఉండవు…ఇక తాము జన్మనిచ్చిన నలుగురు బిడ్డలూ తెల్లకోటు వేసుకుని కండ్లముందుకు వస్తున్నారంటే..ఆ తల్లిదండ్రుల సంతోషం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి.

మీరు చుదువుతుంది నిజమే ఓకే ఇంట్లో నలుగురు అక్క చేల్లెలు డాక్టర్ లు కాబోతున్నారు…సిద్దిపేట జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు అద్భుతం చేశారు..ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అక్కాచెల్లెళ్లు వైద్యులుగా మారేందుకు సిద్ధమయ్యారు.సిద్దిపేట పట్టణం నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు.. రామచంద్రానికి రాజు అనే సోదరుడు ఉండేవాడు. అయితే అతను 1992లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన తల్లి మల్లవ్వ గొంతు క్యాన్సర్‌తో మృతిచెందింది.

దీంతో రామచంద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన ఇంట్లో ఒక్క డాక్టరైనా ఉండి ఉంటే తల్లి, సోదరుడిని కాపాడుకునే వాడిని కదా అనుకున్నారు. తనకు ఉన్న నలుగురు పిల్లల్లో ఒక్కరినైనా వైద్యురాలిని చేయాలని సంకల్పించారు. ఏళ్ల తరబడి భార్యభర్తలు ఇద్దరూ దర్జీలుగా పని చేస్తూ పిల్లలను బాగా చదివించారు..అయితే పెద్ద కుమార్తె మమత ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిగా చేసింది. రెండో కుమార్తె మాధురి కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు రోహిణి(అక్క), రోషిణి(కవలలు) సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపించారు.

నీట్- 2024లో రోహిణికి 536 మార్కులు రాగా, రోషిణికి 587 మార్కులు వచ్చాయి. వీరిద్దరూ జగిత్యాల మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. నీట్- 2023లోనే రోహిణికి సీటు వచ్చింది. అయితే రోషిణికి మాత్రం రాలేదు. దీంతో చెల్లి బాధపడుతుందని ఆమె కళాశాలలో చేరలేదు. ఇద్దరూ కలిసి ఈసారి అదరగొట్టారు. మంచి మార్కులు సాధించి ఒకే కళాశాలలో సీటు పొందారు. త్వరలో నలుగురూ డాక్టర్లు కాబోతుండడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తమను చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారని, వారి నమ్మకాని ఒమ్ము చేయబోమని అక్కాచెల్లెళ్లు చెప్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు మా ఇష్టాన్ని కాదనకుండా ఎంబీబీఎస్ చదవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమ ముగ్గురికీ పెద్ద అక్కనే రోల్ మోడల్ అంటున్నారు. అందరం కలిసి అమ్మానాన్న కల సాకారం చేస్తామని చెప్తున్నారు. పిల్లలు హైదరాబాద్‌లో చదవడంతో చాలా మంది అనేక రకాల మాటలు అనేవారని, వాటిని పట్టించుకోకుండా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగామని రామచంద్రం దంపతులు అంటున్నారు. తమ పిల్లలను సరస్వతీ పుత్రులు అని పలువురు కొనియాడుతున్నారని, ఆ మాటలు వింటున్నప్పుడు తమ కష్టాన్ని మర్చిపోతున్నట్లు ఆనంద భాష్పాలు రాల్చారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా వారిని డాక్టర్లగా నిలబెడతామని అంటున్నారు. ఇక ఈ అక్క చెల్లిలను చూసిన ఇతర పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అంటే ఇలా ఉండాలని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..