Love Story: ఇదో వెరైటీ ప్రేమకథా చిత్రం.. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళి చేసుకున్న జంట!

ప్రేమ జెండర్‌కు సంబంధించింది కాదని, మనసుకు మాత్రమే సంబంధించిందని కొత్త జంట చెబుతుండగా, ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Love Story: ఇదో వెరైటీ ప్రేమకథా చిత్రం.. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళి చేసుకున్న జంట!
Love Marriage
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 20, 2024 | 10:50 AM

ట్రాన్స్ జెండర్‌తో మొదలైన ప్రేమ.. పెళ్లి అనే బంధంతో ఒక్కటై శుభం కార్డు పడింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు.. మొదట కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆ తరువాత.. ఒప్పుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట..!

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ లవ్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు, మల్యాల మండలం మ్యడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్‌తో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. వీరి మధ్య చిగురించిన ప్రేమ, యువకుడు ఉపాధి కోసం దేశం వీడినా మరింత పెరిగింది. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుంది ఈ జంట. యువకుడి ఇంట్లో ఒప్పించి మరికొందరి బంధువులు, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ప్రేమ జెండర్‌కు సంబంధించింది కాదని, మనసుకు మాత్రమే సంబంధించిందని కొత్త జంట చెబుతుండగా, ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇద్దరిని పెద్ద మనుషులు దీవించారు. ట్రాన్స్ జెండర్ ఫై వివక్ష కొనసాగుతున్న తరుణంలో యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జగిత్యాల జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.