AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Video Call: అర్థరాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేకు వీడియో కాల్.. అవతలి వ్యక్తిని చూసి షాక్..!

నేరగాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ చేసుకున్నారా..? అందునా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలనే లక్ష్యం చేసుకున్నారా..? క్రిమినల్స్ వ్యవహరిస్తున్న తీరు దేనికి సంకేతం..? వెలుగులోకి వచ్చిన ఈ వరస ఘటనలతో పోలీసులు హై అలెర్ట్‌.

Fake Video Call: అర్థరాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేకు వీడియో కాల్.. అవతలి వ్యక్తిని చూసి షాక్..!
Fake Video Call
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 20, 2024 | 10:59 AM

Share

నేరగాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ చేసుకున్నారా..? అందునా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలనే లక్ష్యం చేసుకున్నారా..? క్రిమినల్స్ వ్యవహరిస్తున్న తీరు దేనికి సంకేతం..? వెలుగులోకి వచ్చిన ఈ వరస ఘటనలతో పోలీసులు హై అలెర్ట్‌గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులే కాదు.. సామాన్యులకు కూడా ఇలాంటి కాల్స్ వెళ్తున్నాయి. ఇటీవల. ఈ కాల్స్ పెరిగిపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సైబర్ కేటుగాళ్ల నుంచి రక్షించడంటూ వేడుకుంటున్నారు

తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు అర్థరాత్రి న్యూడ్ కాల్ చేశారు సైబర్ క్రిమినల్స్. అక్టోబర్ 14వ తేదీ తెల్లవారు జామున 2 గంటల 2 నిమిషాలకు సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ రావడంతో ఆయన లిఫ్ట్ చేశారు. కాల్ చేసిన అగంతకులు న్యూడ్ వీడియో ప్రదర్శించడంతో ఖంగుతిన్న ఆయన, వెంటనే కాల్ కట్ చేశారు. ఈ నెల 17న హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 67A ITA 2000-2008 సెక్షన్ పై కేసు నమోదు చేసిన సైబర్ వింగ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

అయితే.. ఇలాంటి కాల్స్ నిత్యం వస్తున్నాయి కొంత మందికి.. రాత్రి పది దాటిన తరువాత న్యూడ్ కాల్స్ వస్తున్నాయి. కొంత మందికి ఈ కాల్స్ గురించి తెలియక ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. వారి ఉబిలో చిక్కుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే.. ఈ కాల్ లిఫ్ట్ చేస్తే.. న్యూడ్ కాల్స్ స్క్రీన్ శాట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మాయగాళ్లు. దీంతో చాలా మంది అమాయకులు తెలియక మోసపోతున్నారు. పోలీసులకు పిర్యాదు చేయడానికి జంకుతున్నారు. అయితే తమకు ఫిర్యాదు చేస్తే.. ఇలాంటి కేసులు రహస్యంగా ఉంచుతుమని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి న్యూడ్ కాల్స్ జనం భయపడుతున్నారు. ఈ ముఠా ఫై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..