Actress: ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు

ప్రముఖ సినీ నటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోజువారీ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడగా, నటితో పాటు ఆమె కారు డ్రైవర్ కూడా క్షతగాత్రులయ్యారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Actress: ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
Actress Urmilla Kothare
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2024 | 8:39 PM

ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటి ఊర్మిళ కొఠారి కారు ప్రమాదానికి గురైంది. నటి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కూలిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నటి ఊర్మిళ మరియు ఆమె కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కాగా, ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఊర్మిళ కొఠారి గురువారం అర్థరాత్రి సినిమా షూటింగ్ నుండి తిరిగి వస్తుండగా ముంబైలోని కంధివాలి ప్రాంతంలో పోయిసార్ మెట్రో ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెర్చుకోవడంతో నటి, ఆమె కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి కూడా గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నటి హ్యుందాయ్ వెర్నా కారు అతి వేగంతో వెళుతుండగా, అది అదుపు తప్పి కార్మికులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టింది. సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా పోలీసులు కారును సీజ్ చేశారు. కారు డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేసి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో దెబ్బతిన్న హీరోయిన్ కారు.. వీడియో

ఊర్మిళ కొఠారే మరాఠీ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా కొనసాగుతోంది. 2006లో విడుదలైన మరాఠీ చిత్రం ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’తో ఆమె సినిమా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఆమె బుల్లి తెరపై కూడా సందడి చేసింది. ఊర్మిళతో పాటు ఆమె భర్త ఆదినాథ్ కొఠారే కు కూడా సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయి. మరాఠీతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా పనిచేశాడు. ఊర్మిళ హిందీ సినిమాలకు కూడా పనిచేసింది. 2022 సంవత్సరంలో, సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగన్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ అనే చిత్రంలో ఆమె సిద్ధార్థ్ సోదరి పాత్రను పోషించింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి కూడా నటించారు. ఇక 2013లో వచ్చిన ‘వెల్‌కమ్ ఒబామా’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించిందీ అందాల తార.

ఊర్మిళ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!