AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: అటు ఎన్నికల ఫలితాలు.. ఇటు తిరుపతిలో త్రిష.. ఉదయాన్నే శ్రీవారి దర్శనంలో హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ త్రిష 44వ పుట్టినరోజు నేడు (మే 4). ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు తన బర్త్ డే సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లింది త్రిష. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Trisha: అటు ఎన్నికల ఫలితాలు.. ఇటు తిరుపతిలో త్రిష.. ఉదయాన్నే శ్రీవారి దర్శనంలో హీరోయిన్..
Trisha
Rajitha Chanti
|

Updated on: May 04, 2026 | 9:13 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలోకి చక్రం తిప్పుతుంది. 2002లో థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘మౌనం పేసియతే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమాతో పాపులర్ అయ్యింది. అలాగే తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ‘అభియుమ్ నానమ్’ చిత్రానికి గాను త్రిష తమిళనాడు రాష్ట్ర అవార్డు, కళైమామణి అవార్డుతో సహా పలు పురస్కారాలను గెలుచుకున్నారు. గత 24 ఏళ్లుగా దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా సత్తా చాటుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

విజయ్ ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, అజిత్ ‘విదాముయార్చి’ వంటి చిత్రాల్లో నటించి ఇటీవలే హిట్స్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే త్రిష నటించిన కరుప్పు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సూర్య హీరోగా నటించిన ఈ మూవీ మే 14న అడియన్స్ ముందుకు రానుంది. 75కు పైగా చిత్రాలలో నటించిన త్రిష, గత 3 నెలలుగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. గత కొన్ని నెలలుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ముఖ్యంగా కోలీవుడ్ విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారనే ప్రచారం నడుస్తుంది. ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

అయితే మే 4న అంటే ఈరోజు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవలే సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో ఓవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా.. మరోవైపు తన పుట్టినరోజు వేడుకల కోసం తిరుపతికి వెళ్లింది త్రిష. నిన్న రాత్రి ఆమె కారులో తిరుపతికి వెళ్తున్న వీడియోను షేర్ చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, త్రిష తిరుపతి పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం త్రిష తెల్లవారుజామున తిరుపతిలో దర్శనం చేసుకున్నారు.ఉదయాన్నే తిరుపతి ఎళుమలైయన్ ఆలయంలో సుప్రపద సేవకు హాజరయ్యారు. దర్శనం తర్వాత త్రిష ఆలయ ప్రాంగణంలో నడుస్తుండగా, ఒక అభిమాని, “మేడమ్, ఈరోజు ఫలితం మన వైపే ఉంది,” అని అనగా, త్రిష నవ్వి వెళ్ళిపోయారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us