బెడ్‌రూమ్ సీన్లు చేసి చేసి విసిగిపోయానన్న నటి..!

బెడ్‌రూమ్ సీన్లు చేసి చేసి బోర్ కొడుతోందని చెప్పుకొచ్చింది సింగర్ కమ్ నటి ఆండ్రియా. ధనుష్ హీరోగా నటించిన 'వడ చెన్నై' సినిమాలో ఆండ్రియా 'చంద్ర' అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే

  • Tv9 Telugu
  • Publish Date - 9:50 pm, Sat, 29 February 20
బెడ్‌రూమ్ సీన్లు చేసి చేసి విసిగిపోయానన్న నటి..!

బెడ్‌రూమ్ సీన్లు చేసి చేసి బోర్ కొడుతోందని చెప్పుకొచ్చింది. సింగర్ కమ్ నటి ఆండ్రియా. ధనుష్ హీరోగా నటించిన ‘వడ చెన్నై’ సినిమాలో ఆండ్రియా ‘చంద్ర’ అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అందులో నటుడు అమీర్‌తో ఆండ్రియాకు బెడ్‌రూమ్ సీన్లు ఉంటాయి. ఇక ఈ మూవీ తరువాత ఆమెకు అలాంటి పాత్రలే చాలా వచ్చాయట. అయితే వాటితో ఆమె విసిగిపోయిందట. ఈ విషయాలను ఆండ్రియానే చెప్పుకొచ్చారు.

వడ చెన్నైలో తాను నటించిన పాత్ర తన కెరీర్‌పై ప్రభావాన్ని చూపిందని ఆండ్రియా తెలిపారు. చాలా మంది దర్శకులు అలాంటి పాత్ర కోసం తనను సంప్రదించారని.. కానీ అలాంటి సీన్లు చేయాలంటే విసిగిపోయాయని ఆమె అన్నారు. ఇక తనకు మంచి పాత్రలు ఇస్తే.. తన రెమ్యునరేషన్ సైతం తగ్గించుకుంటానని ఆండ్రియా ఆఫర్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆండ్రియా విజయ్ మాస్టర్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీతో పాటు కా, వత్తమ్, మలిగై అనే చిత్రాల్లోనూ ఆమె కనిపించనుంది.