కన్నీటి పర్యంతమైన నటుడు ఆలీ..

అతనో నవ్వుల ఖజానా..నిక్కరు వేసుకునే వయసునుంచే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. యాక్టింగ్‌లో ఎన్నో మేళవింపులు ఉన్నా, కళామతల్లి మాత్రం అతడిని జనాన్ని నవ్వించడానికే స్వీకరించింది. ఒక్కో మెట్టూ అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా చరిత్రలో అతను కనిపిస్తేనే నవ్వేంతలా అభిమానులను సంపాదించుకున్నాడు.

కన్నీటి పర్యంతమైన నటుడు ఆలీ..
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 01, 2020 | 2:31 PM

అతనో నవ్వుల ఖజానా..నిక్కరు వేసుకునే వయసునుంచే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. యాక్టింగ్‌లో ఎన్నో మేళవింపులు ఉన్నా, కళామతల్లి మాత్రం అతడిని జనాన్ని నవ్వించడానికే స్వీకరించింది. ఒక్కో మెట్టూ అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా చరిత్రలో అతను కనిపిస్తేనే నవ్వేంతలా అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం వెండితెర మీదే కాదు..బుల్లితెరమైన కూడా హోస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఇప్పటికే అతనెవరో మీకు అర్థమైఉంటుంది. హి ఈజ్ నన్ అదర్‌దెన్..నవ్వుల పైరగాలి..ఆలీ.

ఆలీ..ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అది తన కామెడీ వల్ల కావొచ్చు..వివాదస్పద వ్యాఖ్యల వల్ల కావొచ్చు. కానీ సైలెంట్‌గా అతను చేసే సేవా కార్యక్రమాలను మాత్రం మూడోొ కంటిని కనపడనియ్యరు ఈ ఏస్ కమెడియన్. విమర్శలు, విజయాలు వచ్చిపోతున్నా అలా నవ్వుతూ ఉండిపోతారంతే. ఎప్పుడూ అందర్ని నవ్వించే ఆలీ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.  ఆలీ హోస్ట్‌గా చేస్తోన్న బుల్లితెర కార్యక్రమం ‘ఆలీతో సరదా’ ఇటీవల ఎఫిసోడ్‌కి ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడు అతిథిగా రవిశంకర్ వచ్చారు. ఆ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. అందులో సంభాషణ జరుగుతున్న సమయంలో రవిశంకర్ తన తల్లితో ఉన్న అనుభావాలను పంచుకుంటున్న సమయంలో ఆలీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవలే ఆలీ అమ్మగారు కాలం చేశారు. ఆ భావోద్వేగ క్షణాలు గుర్తుకువచ్చి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పుడుతూనే కన్నీళ్లు పెట్టించడం..తాను వెళ్లిపోయి జీవితాంతం కన్నీళ్లను మిగల్చడం అమ్మకి అలవాటేగా..!