Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saloni: అమ్మ బాబోయ్ సలోని ఇంతలా మారిపోయింది ఏంటి.? బర్త్‌డే బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూశారా.?

అందాల తార సలోని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ బ్యూటీ. చూడ్డానికి తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది. 2003లో దిల్‌ పరదేశీ హో గయా అనే హిందీ సినిమా ద్వారా...

Saloni: అమ్మ బాబోయ్ సలోని ఇంతలా మారిపోయింది ఏంటి.? బర్త్‌డే బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూశారా.?
Actress Saloni
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 01, 2023 | 8:23 PM

అందాల తార సలోని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ బ్యూటీ. చూడ్డానికి తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది. 2003లో దిల్‌ పరదేశీ హో గయా అనే హిందీ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైందీ చిన్నది. అనంతరం ధనా 51 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఒక ఊరిలో’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మగధీర చిత్రంలో చిన్న గెస్ట్ రోల్‌లో నటించి అలరించింది. ఇక అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్‌గా నటించి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకడుతాయని అంతా భావించారు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేవు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

చివరిగా 2016లో వచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది మరో సినిమాలో నటించలేదు. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. సలోని ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సలోని 1987 జూన్‌ 1వ తేదిన జన్మించింది. ఈ బ్యూటీ నేటితో 36 ఏళ్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సలోనికి సంబంధించి లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి సలోనికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. పూర్తిగా మారిన సలోనిని చూసిన ఫ్యాన్స్‌ ఒకింత షాక్‌కి గురవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..