అలాంటి వారిని అసలు పెళ్లి చేసుకోను: సాయి పల్లవి
23 February 2025
Basha Shek
అమరన్, తండేల్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.
ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామయాణం సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది.
సినిమాల సంగతి తప్పితే తన వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయట మాట్లాడదు సాయి పల్లవి.
అయితే తాజాగా ఓ సందర్భంలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ న్యాచురల్ బ్యూటీ
ఈ నేపథ్యంలో సాయిపల్లవి తన ఇష్టాయిష్టాలు, పెళ్లి, భర్త, జీవితం ఇలా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులు, అలాగే పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదట
ముఖ్యంగా పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోదట ఈ అందాల తార.
మరి మన సాయి పల్లవికి అభిరుచులకు తగిన వాడు ఎక్కడున్నాడో కాలమే సమాధానం చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..