23 February 2025
ఛాన్స్ వస్తే అలాంటి సీన్లకు రెడీ.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
అచ్చ తెలుగమ్మాయి.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రీతూ వర్మ. తాజాగా సందీప్ కిషన్ సరసన మజాకా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ స్క్రీన్ ముద్దు సన్నివేశాలకు తాను వ్యతిరేకం కాదని అన్నారు రీతూవర్మ.
అవకాశం వస్తే కిస్, హగ్ సన్నివేశాల్లో నటించేందుకు ఆమె రెడీ అన్నారు. ముద్దు సన్నివేశాల సినిమాల్లో నాకు అవకాశం రాలేదని తెలిపింది.
కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు తాను ఏమాత్రం ఇబ్బందిపడనని.. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయాదని ..
కొందరు ఓ నిర్ణయానికి వచ్చేస్తారని.. ఆ కారణంతోనే తనకు అలాంటి కథలు రావడం లేదని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది రీతూ వర్మ.
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది రీతూవర్మ. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడనుకోలేదని.. అతడు తప్పకుండా సక్సెస్ అనుతాడనుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్