Payal Rajput: ఎన్ని కష్టాలు వచ్చినా ఆశలు వదులుకోలేదు.. పాయల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
ఈ సినిమా ఇచ్చిన విజయంతో పాయల్‌కు వరుస అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో మాత్రం విజయం దక్కించుకోలేకపోయింది. ఆర్‌ఎక్స్100 తర్వాత మళ్లీ పాయల్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతికి సైతం ఆర్‌ఎక్స్ 100 లాంటి మరో విజయం దక్కలేదు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రంపై అందరి దృష్టి పడింది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా...

ఆర్‌ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయైంది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఓవైపు గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూనే మరోవైపు నెగిటివ్ రోల్‌లో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన విజయంతో పాయల్‌కు వరుస అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో మాత్రం విజయం దక్కించుకోలేకపోయింది. ఆర్‌ఎక్స్100 తర్వాత మళ్లీ పాయల్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతికి సైతం ఆర్‌ఎక్స్ 100 లాంటి మరో విజయం దక్కలేదు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రంపై అందరి దృష్టి పడింది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
తెలుగు, హిందీతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నవంబర్ 17వ తేదీన సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా శనివారం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్‌తో పాటు, మంగళవారం చిత్రానికి సంబంధించిన వివరాలను పంచుకుంది.
ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. ‘కొంతకాలం వరకు నా కెరీర్ విషంలో తీవ్ర గందరగోళంలో ఉన్నాను. ఎవరితో మాట్లాడాలో, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆశలు మాత్రం వదులుకోలేదు. అయితే ఇప్పుడు మంగళవారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమాను నేను ఒక వరంలా భావిస్తున్నాను. ఆర్‌ఎక్స్ 100 మూవీ నా జీవితాన్ని మార్చేసింది. గతేడాది నుంచి ‘మంగళవారం’ సినిమా కోసమే పని చేస్తున్నాను. ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ అవుతున్నట్లు ఉందని పాయల్ చెప్పుకొచ్చింది.
మంగళవారం సినిమా ట్రైలర్..
ఇక మంగళవారం చిత్రం విజయంపై పాయల్ ధీమా వ్యక్తం చేసింది. అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని, తనకు విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నట్లు పాయల్ తెలిపింది. ఇక మంగళవారం సినిమా కోసం దర్శకుడు అడిగిన సమయంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు, వైద్యులు కచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని సూచించారని తెలిపింది. అయితే అజయ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో.. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తానని తెలిపినట్లు చెప్పుకొచ్చింది. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న మంగళవారం చిత్రం పాయల్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…



