- Telugu News Photo Gallery Cinema photos Trivikram Srinivas son Rishi Manoj will make his directorial debut
Tollywood: ఈ ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? మెగా ఫోన్ పట్టనున్న స్టార్ డైరెక్టర్ వారసుడు..
పై ఫొటోలో ప్రముఖ నటుడు రాజా చెంబోలు దంపతులతో ఉన్నదెవరో తెలుసా? అతను ఓ స్టార్ డైరెక్టర్ కుమారుడు. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత ఈ స్టార్ డైరెక్టర్ సొంతం. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. అదే సమయంలో మాస్ సినిమాలను తెరకెక్కించడంలో ఈ స్టార్ డైరెక్టర్ దిట్ట.
Updated on: Oct 21, 2023 | 5:30 PM

పై ఫొటోలో ప్రముఖ నటుడు రాజా చెంబోలు దంపతులతో ఉన్నదెవరో తెలుసా? అతను ఓ స్టార్ డైరెక్టర్ కుమారుడు. టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత ఈ స్టార్ డైరెక్టర్ సొంతం. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. అదే సమయంలో మాస్ సినిమాలను తెరకెక్కించడంలో ఈ స్టార్ డైరెక్టర్ దిట్ట.

ముఖ్యంగా డైరెక్టర్‌గా కంటే డైలాగ్ రైటర్‌గానే ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కలం నుంచి జాలువారే డైలాగులు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. మాటల మాంత్రికుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు మాటల స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి మనోజ్.

ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించింది.

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. హీరోగా కాదు తండ్రి బాటలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. దీనికి సంబంధించి రిషి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడట.

తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో రిషీ మనోజ్ కూడా ఉన్నాడు. చూడ్డానికి హీరోలా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.