Janhvi Kapoor: అలా అనే ముందు ఓసారి ఈ వీడియో చూడండి.. నెటిజన్‌కు జాన్వీ కౌంటర్
తనను ట్రోల్ చేసిన ఓ నెటిజన్‌పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది అందాల తార. వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ ఇటీవల 'మిస్టర్ అండర్ మిసెస్ మహి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జాన్వీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా కోసం జాన్వి ప్రత్యేకంగా శిక్షణ సైతం తీసుకున్నారు...
సెలబ్రిటీలకు ట్రోలింగ్ సర్వసాధారణమైన విషయమని చెప్పాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ ట్రోలింగ్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై ట్రోలింగ్స్ ఎక్కువైపోయితున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో తమపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై నేరుగా హీరో, హీరోయిన్లే స్పందించే పరిస్థితి వచ్చింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌కు ఇలాంటి ఓ అనుభూతి ఎదురైంది.
తనను ట్రోల్ చేసిన ఓ నెటిజన్‌పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది అందాల తార. వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ ఇటీవల ‘మిస్టర్ అండర్ మిసెస్ మహి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జాన్వీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా కోసం జాన్వి ప్రత్యేకంగా శిక్షణ సైతం తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తనకు గాయాలు అయినట్లు జాన్వీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడితేనే ఇన్ని దెబ్బలు తగిలాయాల.? అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్ చేశాడు. దీంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న జాన్వీ కపూర్.. ‘ముందు క్రికెట్ బాల్‌తో ఆడితనే గాయాలయ్యాయి. అందుకే టెన్నిస్ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజీలను చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దెబ్బలు తగితిన తర్వాత ఆడిన వీడయోనే ఇదంటూ.. ట్రోల్ చేసే ముందు ఓసారి వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీరు వేసే జోక్‌లకు నేను కూడా నవ్వుతాను’ కౌంటర్ ఇచ్చింది.
View this post on Instagram
ఇదిలా ఉంటే జాన్వీకపూర్ ప్రస్తుతం సినిమాల్లో వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోందీ బ్యూటీ. జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌కు జోడిగా ‘దేవర’ సినిమాతో పాటు రామ్ చరణ్‌కు జంటగా ‘ఆర్సీ 16’లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..