Dhanush: కిడ్నీ ఫెయిల్యూర్‏తో బాధపడుతున్న ప్రముఖ కమెడియన్.. సాయం అందించిన ధనుష్.. విజయ్ సేతుపతి..

ప్రస్తుతం ధనుష్.. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 1930-40ల బ్యాక్ డ్రాప్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్

Dhanush: కిడ్నీ ఫెయిల్యూర్‏తో బాధపడుతున్న ప్రముఖ కమెడియన్.. సాయం అందించిన ధనుష్.. విజయ్ సేతుపతి..
Danush, Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2022 | 8:57 AM

ప్రముఖ తమిళ్ హాస్యనటుడు బోండా మణి ప్రస్తుతం చెన్నైలోని ఓమండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే చికిత్స కోసం భారీగానే ఖర్చు పెట్టిన బోండా మణి.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించేందుకు విరాళం ఇవ్వాలంటూ ఇటీవల కమెడియన్ బెంజమిన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న హీరో ధనుష్ (Dhanush).. అతని వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయాలు సాయం అందించారు. అలాగే తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం రూ. లక్ష విరాళంగా అందించారు.

బోండా మణి సొంత ఊరు శ్రీలంక. చాలా కాలం క్రితం కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చిన ఆయన 1991లో కె.భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన పవుణ.. పవుణదాన్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కొద్ది రోజుల క్రితం రెండు కిడ్నీలు పాడవడంతో అప్పటినుంచి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు కావడం.. ఆర్థిక పరిస్థతి సరిగ్గా లేకపోవడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. గతంలో విజయ్ సేతుపతి బోండా మణి చికిత్సకు రూ. లక్ష అందించగా.. ఇప్పుడు ధనుష్ సైతం లక్ష రూపాయాలు విరాళం అందించారు.

ప్రస్తుతం ధనుష్.. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 1930-40ల బ్యాక్ డ్రాప్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.