AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : శత్రువైనా సరే కష్టంలో ఉంటే ఆదుకునేై గొప్ప నటుడు ఆయన.. తనికెళ్ల భరణి..

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సినీ ప్రయాణంతోపాటు తాను దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Tollywood : శత్రువైనా సరే కష్టంలో ఉంటే ఆదుకునేై గొప్ప నటుడు ఆయన.. తనికెళ్ల భరణి..
Tanikella Bharani
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2026 | 6:44 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పేరు తెలియని వారు ఉండరు. కేవలం అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా, టాలీవుడ్‌లో ఎంతోమంది కళాకారులకు, నటీనటులకు, టెక్నీషియన్లకు ఆయన ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సరే, ఆపద్బాంధవుడిలా ఆదుకోవడంలో దాసరి ఎప్పుడూ ముందుండేవారు. తాజాగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దాసరి నారాయణరావుతో తమకు ఉన్న అనుబంధం, ఆయన చేసిన సహాయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించే నటీనటులకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు దాసరి నారాయణరావు ఇల్లు ఎప్పుడూ తెరిచి ఉండేదని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

ఎవరైనా సహాయం కోసం ఆయనను ఆశ్రయిస్తే, అతడు శత్రువైనా సరే వారి సమస్యను శ్రద్ధగా విని వెంటనే తగిన పరిష్కారం చూపేవారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుడిగా భావించే ఆయన, ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య తలెత్తినా ముందుండి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించేవారు. ఆ రోజుల్లో టాలీవుడ్‌ను ఒక కుటుంబంలా నడిపించడంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. తనికెళ్ల భరణి మాట్లాడుతూ, దాసరి నారాయణరావు గారి స్వభావం గురించి అనేక విషయాలను గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో ఎంతోమందికి ఆయన ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారని, ఎవరికీ ఏ కష్టం వచ్చినా తన సొంత మనిషిలా స్పందించే గొప్ప మనసు ఆయనది అని కొనియాడారు. ఇండస్ట్రీలో ఆయన చూపిన పెద్దరికం, కళాకారులపై ఆయనకు ఉన్న ప్రేమ ఎప్పటికీ మరువలేనివి. నేటితరానికి కూడా దాసరి గారి జీవితం, ఆయన ఆచరించిన పద్ధతులు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

కేవలం మెగాఫోన్ పట్టడమే కాకుండా ‘మామగారు’, ‘సూరిగాడు’, ‘కంటే కూతుర్నే కనాలి’, ‘ఒసేయ్ రాములమ్మ’, ‘మేస్త్రీ’ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎంతోమంది కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి అగ్ర కథానాయకులందరితో బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

Follow Us
అలాంటి నటుడిని చూడలేదు.. కష్టమొస్తే ముందుండే గొప్ప వ్యక్తి..
అలాంటి నటుడిని చూడలేదు.. కష్టమొస్తే ముందుండే గొప్ప వ్యక్తి..
కూతురు పెళ్లికి సుకన్య సమృద్ధి యోజన డబ్బులు మొత్తం తీసుకోవచ్చా..?
కూతురు పెళ్లికి సుకన్య సమృద్ధి యోజన డబ్బులు మొత్తం తీసుకోవచ్చా..?
ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..
ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ