AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆ అంచనాలు నిజమవుతాయా..!

బంగారం కొనాలనుకునే వారికి ఇంతకంటే మంచి శుభవార్త మరొకటి ఉండదు.. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో కుప్పకూలుతున్నాయి. సోమవారం మార్కెట్ తెరుచుకోగానే ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2,320 మేర తగ్గి షాకిచ్చింది. అసలు బంగారం ధర రూ.1 లక్ష మార్కుకు పడిపోనుందా? నిపుణులు చెబుతున్న ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price: తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆ అంచనాలు నిజమవుతాయా..!
Gold And Silver Prices Crash On Mcx
Krishna S
|

Updated on: Nov 16, 2026 | 6:39 PM

Share

పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు ఇది నిజంగా ఒక పెద్ద సువర్ణావకాశం. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. వారంలో మొదటి రోజైన సోమవారం నాడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్ తెరుచుకోగానే బంగారం, వెండి ధరలలో భారీ పతనం కనిపించింది. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,320 మేర చౌకైంది. ఇదే సమయంలో కిలో వెండి ధర కూడా రూ. 6,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది.

MCX మార్కెట్‌లో బంగారం ధరల పతనం ఇలా..

గత వారం చివరి రోజున డిసెంబర్ 4న గడువు ముగిసే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,705 వద్ద ముగిసింది. అయితే సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధర రూ. 1,35,312కు పడిపోయింది. ఆ తర్వాత కూడా పతనం కొనసాగడంతో మధ్యాహ్నానికి రూ.1,34,385కు చేరుకుంది. అంటే ఒక్కరోజే రూ.2,320 మేర తగ్గింది. ఇక జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,77,590తో పోల్చి చూస్తే, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ఏకంగా రూ. 43,205 మేర తక్కువ ధరకు లభిస్తుండటం గమనార్హం.

బంగారం ధర రూ. 1 లక్షకు పడిపోనుందా?

గతంలో మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే బంగారం ధర రూ. 1 లక్ష దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి పసిడి ధర ఇప్పటికే 30 శాతం పడిపోయింది. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. యూఎస్ 10 సంవత్సరాల బాండ్ దిగుబడి పెరిగితే, స్వల్పకాలంలో అంతర్జాతీయ స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,025 – 3,950 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే భారత మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.25 లక్షల స్థాయికి దిగివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వెండి ధర కూడా భారీగా డౌన్

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా వేగంగా పడిపోతున్నాయి. సోమవారం MCX ఫ్యూచర్స్ మార్కెట్ తెరుచుకున్న వెంటనే, డిసెంబర్ 4న గడువు ముగిసే కిలో వెండి ధర రూ.6,000 తగ్గి రూ. 1.70 లక్షలకు పడిపోయింది. తన జీవితకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.4,20,048తో పోల్చి చూస్తే, ఇప్పటివరకు కిలో వెండి ధర దాదాపు రూ. 2.50 లక్షల మేర తగ్గడం విశేషం. ఫ్యూచర్స్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Follow Us
ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..
ఆరు రాశులకు మహా భాగ్య యోగం! ఆర్థికంగా తిరుగే ఉండదు..
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!