AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adarsha Kutumbam OTT: ఓటీటీలో ‘ఆదర్శ కుటుంబం’.. వెంకీ- త్రివిక్రమ్‌ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మంచి కలెక్షన్లే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

Adarsha Kutumbam OTT: ఓటీటీలో 'ఆదర్శ కుటుంబం'.. వెంకీ- త్రివిక్రమ్‌ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Venkatesh's Aadarsha Kutumbam Movie
Basha Shek
|

Updated on: Nov 16, 2026 | 6:35 PM

Share

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. పలు సార్లు వాయిదా పడిన ఆదర్శ కుటుంబం మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైంది. మరీ మల్లీ శ్వరి, నువ్వు నాకు నచ్చావ్ రేంజ్ లో లేకపోయినా ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆదర్శ కుటుంబం సినిమా రన్ అవుతోంది. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆదర్శ కుటుంబం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 40 కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఆదర్శ కుటుంబం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనపై నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది.

ఈ లెక్కన నవంబర్ చివరి వారంలో ఆదర్శ కుటుంబం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’ సినిమాను నిర్మించారు. నారా రోహిత్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌భీర్ సంధూ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. . రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, నవిన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక ఆదర్శ కుటుంబం సినిమా కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ మ్యాన్‌ చిట్టిబాబు(వెంకటేశ్) ఏదో ఒక చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు.అయితే అతని భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) కు గొంతెమ్మ కోరికలతో అప్పుల పాలవుతారు. అలాంటిది వీరు సడెన్ గా లగ్జరీ విల్లాలోకి  చేరతారు.  అప్పుడే వీరి ఫ్యామిలీకి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. మరి చిన్న ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని పోషించిన చిట్టిబాబు ఉన్నట్టుండి లగ్జరీ విల్లాలోకి ఎలా మారాడు? గ్యాంగ్ స్టర్‌తో అతనికి సంబంధం ఏంటి? ? ఇందులో నారా రోహిత్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి