Anchor Suma: యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. అందరూ షాక్
యాంకర్ సుమ గురించి తెలియని వారుండరు.ఆమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు.. స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు. తన మాటలతో, పంచులతో, తనదైన శైలిలో అందర్ని నవ్విస్తూ కట్టిపడేలా చేయడంతో సుమ దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సుమ ఇంటర్వ్యూలతో పాటు ఒక ప్రముఖ ఛానెల్లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

యాంకర్ సుమ గురించి తెలియని వారుండరు.ఆమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు.. స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు. తన మాటలతో, పంచులతో, తనదైన శైలిలో అందర్ని నవ్విస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేలా చేయడంలో సుమ దిట్ట అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక సుమ ఇంటర్వ్యూలతో పాటు ఒక ప్రముఖ ఛానెల్లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. సుమా అడ్డా అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ షోలో సినీ స్టార్లు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వస్తుంటారు. నిజం చెప్పాలంటే.. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా వచ్చిన ఏకైక షో ఏదైనా ఉందా అంటే అది సుమ షో మాత్రమే. తాజాగా ఈ షోలో రామ బాణం చిత్ర బృందం సందడి చేశారు. గోపీచంద్, డింపుల్ హయతి, డైరెక్టర్ శ్రీవాస్, నటుడు గెటప్ శ్రీను వచ్చి తమ సినిమా విషయాలు పంచుకున్నారు.
సినిమాకు సంబంధించిన ముచ్చట్లతో పాటు వారితో సుమ కొన్ని గేమ్స్ కూడా ఆడించింది . ఇక ఈ షోలో గోపీచంద్ హైపర్ యాక్టివ్ గా కనిపిస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. చాలా రిజర్వడ్ ఉండే గోపీచంద్ ఈ షోలో చలాకీగా కనిపించాడు. ఇందులో గోపీచంద్ అప్పట్లో విలన్ గా నటించిన జయం స్పూఫ్ చేసినట్లు తెలుస్తోంది. సదాను గొంతు పట్టుకొని పైకి లేపే సీన్ లో గోపీచంద్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఆ సీన్ నే రీ క్రియేట్ చేస్తూ సుమ గొంతు పట్టుకొని డైలాగ్ చెప్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రామబాణం చిత్రం మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.



