AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది.. కానీ.. టాలీవుడ్ నటుడు కామెంట్స్..

టాలీవుడ్ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రంలో తాను విలన్‌గా నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. అదే పాత్రను తెలుగులో సుమన్ పోషించారని అన్నారు. తన కెరీర్ ఆరంభంలోనే "అడ్వాన్స్‌డ్ విలన్" పాత్రతో గుర్తింపు పొందిన బెనర్జీ, ఆ తర్వాత హీరోగా రావాల్సిన ఒక సినిమా ఎలా ఆగిపోయిందో వెల్లడించారు.

Rajinikanth: రజినీకాంత్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సింది.. కానీ.. టాలీవుడ్ నటుడు కామెంట్స్..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2026 | 8:16 AM

Share

నటుడు బెనర్జీ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో మధుర, చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో తనకున్న అనుబంధం, కెరీర్ ఆరంభంలో ఎదురైన అవకాశాలు, తప్పిపోయిన మలుపుల గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రజినీకాంత్ నటించిన ఓ తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రంలో బెనర్జీ విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమా మూలం హిందీలో నానా పటేకర్ నటించిన “ఆజ్ కీ ఆవాజ్”. తెలుగులో సుమన్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామ్మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఇదే చిత్రం తమిళంలో రజినీకాంత్ హీరోగా, ఆయన నటనకు పెద్ద విజయంగా నిలిచింది. బెనర్జీ తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రధాన విలన్ పాత్రను పోషించారు. “తమిళ్‌లో రజినీకాంత్ హీరో, తెలుగులో సుమన్ హీరో. నేను మెయిన్ విలన్” అని బెనర్జీ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

బెనర్జీ నటించిన విలన్ పాత్ర అప్పటికి చాలా “అడ్వాన్స్‌డ్ విలనీ” తరహాదని, “పాష్” క్యారెక్టర్‌ అని అన్నారు. అప్పుడు తనకు కేవలం 25-27 సంవత్సరాలు ఉన్నప్పటికీ, 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో ఒదిగిపోయానని గుర్తు చేసుకున్నారు. “అంత యంగ్ ఏజ్‌లో… అంత లావు అవ్వాలని లోపల బనీన్ మీద బనీన్, షర్ట్ వేసి లోపల థిక్ బనీన్ వేసి దాని మీద కోట్ వేసి వేసారు” అంటూ ఆ పాత్ర కోసం పడిన శ్రమను వివరించారు. ఈ పాత్రను తనకు ఇవ్వడంలో డైరెక్టర్ గుళ్ళపల్లి రామ్మోహన్ రావు, నిర్మాత పూర్ణచంద్ర రావు గారి కృషి అపారమని కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బెనర్జీని నానా పటేకర్ పోలిక ఉందని గుర్తించి, ఈ ప్రత్యేక పాత్రకు ఎంపిక చేశారని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

అయితే, తమిళంలో రజినీకాంత్ నటించిన సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత, బెనర్జీకి తమిళ చిత్ర పరిశ్రమ నుండి పెద్దగా అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “వాళ్ళు ఎవ్వరూ నాకు, ఎవ్వరికీ తెలీదు తమిళ్ ఇండస్ట్రీలో. మనం ఎవ్వరో తెలీదు, మనకి ఎవ్వరో తెలీదు. ప్లస్ నేనేం పర్స్యూ చేయలా” అని పేర్కొన్నారు. తన గురించి ఎవరైనా అడిగినా, ఎస్.ఏ.చంద్రశేఖర్ వంటి దర్శకులు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే చేశానని చెప్పారని, తాను భవిష్యత్తులో దర్శకుడిని అవుతాననే ఉద్దేశంతో అలా చేశారని తెలిపారు. ఈ “మిస్ కమ్యూనికేషన్” వల్ల తనకు రావాల్సిన పెద్ద అవకాశాలు చేజారాయని బెనర్జీ నమ్మారు. అయినప్పటికీ, ఈ విషయంలో తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని, “నో రిగ్రెట్స్. ఐ జస్ట్ కీప్ గోయింగ్. గుడ్, బ్యాడ్, అగ్లీ, లివ్ హ్యాపీలీ” అంటూ తన జీవిత తత్వాన్ని పంచుకున్నారు. ఒకానొక దశలో హీరోగా అవకాశం వచ్చి, షూటింగ్‌ కూడా చేసిన ఒక ప్రాజెక్ట్ (“ఫాసీ కా ఫందా” మరాఠీ సినిమా హిందీ రీమేక్) మధ్యలోనే ఆగిపోయిందని కూడా బెనర్జీ గుర్తు చేసుకున్నారు. ప్రొడ్యూసర్లు కారణం ఏంటో తెలియకుండానే ఆపేశారని తెలిపారు.

రజినీకాంత్ ఫోటో..

Rajinikanth, Benerjee

Rajinikanth, Benerjee

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us