స్పీడ్ తగ్గించిన అందాల అనుపమ.. బడా హీరోల సినిమాల్లో ఇంకెప్పుడో..

28 June 2026

Pic credit - Instagram

Rajeev 

ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది.

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టా్ర్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.

2015లో ‘ప్రేమమ్’ సినిమాతో ఆమె సినీరంగుల జీవితాన్ని ప్రారంభించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది. మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది. 

ప్రేమమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది అనుపమ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి