సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఊపేస్తున్న బాపుగారి బొమ్మ
28 June 2026
Pic credit - Instagram
Rajeev
కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ప్రణీత సుభాష్. ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది.
పిలవబడే ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో పరిచయం అయ్యింది.
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది.
తెలుగులో అత్తారింటికి దారేది సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కూడా ఈ అమ్మడికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
2012లో, ఆమె సినీ విమర్శకులచే ప్రశంసలు పొందిన కళాత్మక చిత్రం, భీమ తీరలదల్లైలో నటించింది.
ఈ సినిమాలో నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి, సీమా అవార్డు ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయింది.
పెళ్లి తర్వాత సినిమాలు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.