AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లు తెలీక మిస్‌ చేశారేమో.. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే.. ఊడిన జుట్టు ఉరుక్కుంటూ రావాల్సిందే

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది ఖరీదైన షాంపూలు, కెమికల్ ట్రీట్‌మెంట్‌లు ట్రై చేసి ఉంటారు. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనకం లేకపోగా డబ్బులు కూడా లాస్ అయి ఉంటారు. అలాంటి వారి కోసమే.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ సమస్యకు ఈజీగా ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు మేం చెప్పబోతున్నాం. అదేంటో ఇక్కడ తెలుసుకోండి.

Anand T
|

Updated on: Jun 29, 2026 | 7:00 AM

Share
మీరు జుట్టురాలడం, చుండ్రు, స్కాల్ఫ్‌తో బాధపడుతుంటే.. ఈ సమస్యలను దూరం చేసేందుకు వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వేపాకులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలపై వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. చుండ్రు రావడానికి కారణమయ్యే 'మాలసీసియా' అనే ఫంగస్‌ను తగ్గించి జుట్టును రక్షిస్తుంది.

1 / 5
అలాగే  దీనిలోని ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు తలలో రక్తప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. వేపాకులో ఉండే అజాడిరాక్టిన్ తలలోని దురదను, పేల సమస్యను తగ్గిస్తుంది.కాబట్టి క్రమం తప్పకుండా మీరు ఈ వేపాకును ఉపయోగించడం ద్వారా జుట్టు సమస్యను తగ్గించవచ్చు. వీటిని ఇంట్లోనే ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
వేపాకు నీటితో తలస్నానం: ఇందుకోసం ఒక పాత్రలో నీరు తీసుకుని, అందులో ఒక గుప్పెడు వేపాకులు వేసి బాగా మరిగించండి. నీటి రంగు లేత ఆకుపచ్చగా మారేంత వరకు మరిగించిన తర్వాత, ఆ నీటిని చల్లార్చండి. ఇప్పుడు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, చివరగా ఈ వేపాకు నీటితో తలను బాగా కడగాలి. ఇది తల దురదను తగ్గించి, జుట్టుకు మంచి మెరుపును ఇస్తుంది.

3 / 5
వేపాకు - పెరుగు హెయిర్ ప్యాక్ : ఒక గుప్పెడు తాజా వేపాకులను తీసుకుని, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా నూరుకోండి. ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసి బాగా కలపండి. ఈ ప్యాక్‌ను తల చర్మానికి, జుట్టుకు బాగా పట్టించాలి. 20-30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయవచ్చు. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.

4 / 5
వేపాకు - నల్ల జీలకర్ర నూనె: స్వచ్ఛమైన కొబ్బరినూనెను వేడి చేసి, అందులో ఒక గుప్పెడు వేపాకులు, కొద్దిగా నల్ల జీలకర్ర వేసి బాగా మరిగించండి.ఈ నూనె చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోండి. రోజూ తలస్నానం చేయడానికి అరగంట ముందు ఈ నూనెను తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే చుండ్రును తగ్గించడానికి కూడా ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని tv9 దృవీకరించడం లేదు.)

5 / 5
Follow Us