ALLU ARJUN: ఆయన వల్లే ఇదంతా జరిగింది.. ఆ స్టార్ క్రికెటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ..

గతేడాది అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలో సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాలోని పాటలు కూడా సెన్సెషన్ క్రియేట్ చేశాయి.

ALLU ARJUN: ఆయన వల్లే ఇదంతా జరిగింది.. ఆ స్టార్ క్రికెటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2021 | 4:29 PM

గతేడాది అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలో సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాలోని పాటలు కూడా సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అందులోని బుట్ట బొమ్మ పాటకు సెలబ్రెటీలు సైతం స్టెప్పులేసారు. ఇక ఇంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ పాట క్రెడిట్ మొత్తాన్ని స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‏కు ఇచ్చేశారు అల్లు అర్జున్.

ఆహా వేదికలో అక్కినేని సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ షోలో పాల్గొన్న అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుట్ట బొమ్మ పాట కోసం యూనిట్ సభ్యులమంత ఎంతగా కష్టపడ్డామో, డేవిడ్ వార్నర్‏కు కూడా అంతే క్రెడిట్ ఉందని బన్నీ చెప్పాడు. వార్నర్ ఆ పాటకు స్టెప్పులేసాడు కాబట్టే అంత వైరల్ అయిందని తెలిపాడు. ఇటీవల జరిగిన క్రికెట్ సిరీస్ సందర్భంగా స్టేడియంలోనే వార్నర్ ఆ పాటకు స్టెప్పులేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని బన్నీ అన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు.

Also Read:

Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ