Nagarjuna Next Movie: నాగార్జున నెక్స్ట్ మూవీ ఎవరితో తెలుసా? స్క్రిప్ట్ గురించి యంగ్ డైరెక్టర్‌కి ఏం చెప్పారంటే..

Nagarjuna Next Movie: బిగ్‌బాస్‌ వల్ల బిజీగా గడిపిన టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున ఇటీవల రిలీఫ్ అయ్యాడు. పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లను పూర్తిచేసి న్యూ ఇయర్

Nagarjuna Next Movie: నాగార్జున నెక్స్ట్ మూవీ ఎవరితో తెలుసా? స్క్రిప్ట్ గురించి యంగ్ డైరెక్టర్‌కి ఏం చెప్పారంటే..
Follow us
uppula Raju

|

Updated on: Jan 04, 2021 | 5:34 PM

Nagarjuna Next Movie: బిగ్‌బాస్‌ వల్ల బిజీగా గడిపిన టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున ఇటీవల రిలీఫ్ అయ్యాడు. పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లను పూర్తిచేసి న్యూ ఇయర్ వెకేషన్ టూర్‌కు వెళ్లాడు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీతో అహిషోర్ సాల్మన్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల‌కు ఈ సినిమా రెడీ అయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ్ పీఎస్‌వీ గ‌రుడ వేగ ఫేం ప్రవీణ్‌ స‌త్తారుతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ప్రవీణ్ స‌త్తారు స్క్రిప్ట్ ప‌నులు ఇంకా పూర్తి చేయలేదట‌. దీంతో నాగార్జున ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు. న్యూ ఇయ‌ర్ వెకేష‌న్ కు వెళ్లే ముందు ప్రవీణ్ స‌త్తారును మిగిలిన స్క్రిప్ట్ పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించిన‌ట్టు టాలీవుడ్ వర్గాల స‌మాచారం. ఒక‌వేళ అనుకున్న స‌మ‌యానికి క‌థ రెడీ అవ‌క‌పోతే నాగ్ వేరే దర్శకుడితో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. మ‌రి ప్రవీణ్ స‌త్తారు ఏం చేస్తాడో వేచి చూడాలి.