Prabhas: ప్రభాస్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చిన టీ సిరీస్.. దర్శకుడు ఎవరో తెలుసా.?
ప్రభాస్ ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీంతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సలార్ పార్ట్2తో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో భారీ అవకాశం దక్కించుకున్నట్లు...

బాహుబలితో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగారు ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా బజ్ పెరుగుతుంది. సలార్‌తో భారీ విజయాన్ని అందుకొని, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించిందీ మూవీ. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి మేకర్స్ సైతం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అత్యధిక పారితోషకం ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, సలార్ పార్ట్2తో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో భారీ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఇందుకోసం ప్రభాస్‌కు ఇప్పటికే భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ గతంలో ప్రభాస్‌తో ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. విడుదలకు ముందుగానే జరిగిన బిజినెస్‌తో టీ సిరీస్ లాభాలు గడించింది. దీంతో మరోసారి ప్రభాస్‌తో టీసిరీస్ చేతులు కలుపుతున్నట్లు సమాచారం.
‘వార్’ సినిమా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఓ కథ కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్, సలార్ సీక్వెల్‌తో పాటు అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన టీ సిరీస్ సినిమా పట్టాలెక్కడానికి కనీసం రెండేళ్లు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




