Shankar: శంకర్ మరో సంచలనం.. నవల ఆధారంగా రూ. 1000 కోట్లతో సినిమా.? హీరో ఎవరంటే..
Shankar: కోలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఆ చిత్రంపై పడుతుందనడంలో...
Shankar: కోలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఆ చిత్రంపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. విభిన్న కథాంశాలు, భారీ సెట్టింగ్స్‌తో కూడిన చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ తాజాగా మరో సంచలనానికి తెర తీయనున్నారని తెలుస్తోంది. ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఎస్. వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి అనే నవలను శంకర్ సినిమాగా తెరకెక్కించనున్నారని సమాచారం.
ఈ క్రేజీ చిత్రంలో సూర్య హీరోగా నటించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా చారిత్రాక నేపథ్యంలో ఉండడం వల్ల సెట్టింగ్‌లకే భారీ మొత్తాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరి వెయ్యి కోట్ల బడ్జెట్ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే శంకర్ ప్రస్తుతం రామ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత సూర్యతో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే పొన్నియన్ చిత్రాన్ని శంకర్ హిందీలో రీమేక్ చేయనున్నారనే వార్త కూడా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే శంకర్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..