వీటికి ఆమిర్ వివరణ ఇవ్వాలి: కంగనా

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన తదుపరి చిత్రం లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ కోసం టర్కీకి వెళ్లిన ఆయన.

  • Publish Date - 1:15 pm, Tue, 18 August 20 Edited By:
వీటికి ఆమిర్ వివరణ ఇవ్వాలి: కంగనా

Kangana on Aamir issue: బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన తదుపరి చిత్రం లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ కోసం టర్కీకి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రథమ మహిళ ఎమినే ఎర్డోగన్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎమినే సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ఆమిర్‌, ఎమినేను కలవడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్‌కి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్‌ సమావేశమేంటని మండిపడుతున్నారు. ఇక ఈ వివాదంపై బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా స్పందించారు.

ఈ విషయం  చాలా విధాలుగా ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో ఆమిర్‌ ఖాన్ కేవలం నటుడే కాదు. ఆయన పలు విషయాల్లో భాగం అయ్యారు. ఆయన ఒక పెద్ద ఐకాన్‌. కానీ ఇప్పుడు ఆయన కపటదారిగా మారారు. వీటిపై ఆయన స్పందించాలి. ఎందుకంటే దీని వలన చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి అని కంగనా టీమ్ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో వెల్లడించారు. మరి ఈ వివాదంపై మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More:

నా పక్కన కనిపించిన ప్రతి వ్యక్తితో నాకు లింక్ పెట్టారు

 

ధోని పుట్టిన రోజే నా కంపెనీ పుట్టింది: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి